Sundaram Master : షాకింగ్ : సుందరం మాస్టర్ పై వైరల్ అవుతున్న వార్తలు.. అసలు మేటర్ ఏమిటంటే!

Sundaram Master : సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఎంతో  ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్స్ లో టాప్ డాన్స్ మాస్టర్స్ అయినటువంటి ప్రభుదేవా మరియు రాజు సుందరం ల కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ ఇద్దరినీ నృత్యంలో తిరుగు లేని వారిగా మార్చింది వారి తండ్రి సుందరం మాస్టర్.
అప్పట్లో ఎన్నో సినిమాల్లో ఎందరో స్టార్ హీరోస్ కి ఐకానిక్ స్టెప్పులు కంపోజ్ చేసిన ఆయన తర్వాత అనేక డాన్స్ షోస్ లో కూడా కనిపించారు. అయితే ఇప్పుడు వయసు పై పడడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఆయనపై ఒక షాకింగ్ రూమర్ సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.
ఆయన అనారోగ్య సమస్యలతో నిన్న కన్ను మూశారని అనేక మంది సోషల్ మీడియాలో విషాదం వ్యక్తం చేశారు. కానీ ఈ విషయంలో మాత్రం కొన్ని ట్రస్టడ్ సోర్సెస్ చెబుతున్న సమాచారం ప్రకారం అసలు ఆయనపై వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. చిన్న మిస్ కమ్యూనికేషన్ వాళ్ళ ఇంత తప్పు జరిగింది అట.
నిజానికి ఇండస్ట్రీకి చెందిన ఓ రచయిత పైగా ఆయన కూడా పెద్దాయన మరియు సుందరం అనే పేరున్న వ్యక్తి కాగా ఆ వార్త సుందరం మాస్టర్ పై ఆపాదించబడి మారిపోయిందట. దీనితో తప్పదా ఇది ప్రచారం జరుగుతుంది అని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇంకా ప్రస్తుతం సుందరం మాస్టర్ బాగానే ఉన్నారని ఎలాంటి ఆరోగ్యం సమస్యలు కూడా లేవని కన్ఫర్మ్ అయ్యింది.