Crime News:అతి వేగం ప్రమాదకరం అని అందరికీ తెలిసిన విషయం. కానీ కొంతమంది మూర్కత్వం, మరి కొంత మంది యువత బాధ్యతరాహిత్యం, ఇంకొంత మంది సమయానికి పనులు చేసుకోవాలి అనే ఉధ్యేశ్యం తో వేగంగా వాహనాలు నడుపుతుంటారు. కరోనా మొదలయినప్పటి నుండి ప్రజా రవాణా కంటే ఎక్కువగా వారి సొంత వాహనాల్లోనే రవాణా కొనసాగిస్తున్నారు. అతివేగం వల్ల చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, ఇలాంటి సంఘటనే ఒకటి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్ర కోట లో సంభవించింది.
కర్నూలు నుండి ఎమ్మిగనూరు వెళ్తున్న కారు ప్రమాదవ శాత్తూ అదుపు తప్పి ఎర్రకోట వద్ద ఉన్న బావిలో పడింది.వేగంగా వస్తున్న కారు ముందు ఉన్న మరొక వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బావి లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ఒక్కరే ఉండటంవల్ల పెను ప్రమాదం తప్పింది. జెసిబి సహాయంతో పోలీసులు కార్ ని బయటకి తీశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోడుమూరు కు చెందిన రామాంజనేయులు అనే డ్రైవర్.. ఒక పేషెంట్ ను తీసుకు రావడానికి హుండాయ్ క్రెటా వాహనంలో ఎమ్మిగనూరు కు బయలుదేరాడు. వాహనం ఎర్రకోట సమీపంలోకి రాగానే డ్రైవర్ మరొక వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి పక్కనే ఉన్న బావి లోకి కారు దూసుకెళ్లింది. కారు బాగా వేగంగా నదపటంతో బావి లో దాదాపు పదిహేను అడుగుల లోతుకి వెళ్లి ఇరుక్కు పోయింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని జెసిబి సహాయంతో కారు నీ వెలికితీసే ప్రయత్నం మొదలు పెట్టారు. అతి కష్టం మీద కారు ను వెలికితీశారు. కార్ డ్రైవర్ రామాంజనేయులు మృతదేహాన్ని కూడా వెలికి తీశారు .మొదటగా కార్ లో ఎక్కువ మంది ఉన్నట్టు అనుమానపడ్డారు, అయితే కార్ లో డ్రైవర్ మాత్రమే ఉండటంతో ఎక్కువ ప్రాణ నష్టం జరగలేదు. ఇంకా కార్ లో ఎవరైనా ప్రయాణం చేశారా అని అనుమానంతో బావి మొత్తం గాలించినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్థుల సహాయంతో గాలింపు త్వరగా అయినట్లు పోలీసులు చెప్పారు.