కన్నడ ఇండస్ట్రీ కి చెందిన “కేజీయఫ్” సినిమా కోసం తెలుగు ఆడియెన్స్ కి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెద్దగా అంచనాలు లేకుండానే తెలుగులో భారీ హిట్ అయ్యింది ఈ చిత్రం. 2018లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఒక్క కన్నడలో మినహా మిగతా అన్ని భాషల్లో కూడా తక్కువ అంచనాలతోనే రిలీజ్ అయ్యింది కానీ దీనికి వచ్చిన రిజల్ట్ మాత్రం ఇంకో స్థాయికి వచ్చింది.
అందుకే దీనికి సీక్వెల్ “కేజీఎఫ్ చాప్టర్ 2” కి భారీ లెవెల్ హైప్ నెలకొంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడడంతో అప్డేట్స్ కూడా పెద్దగా లేవు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం వచ్చే జనవరి 8కి ఈ సినిమా నుంచి భారీ అప్డేట్ ఉండబోతుందట. ఈసారి ఇంకో టీజర్ కానీ అదిరే గ్లింప్స్ ని రిలీజ్ చెయ్యబోతున్నట్టు ఇప్పుడు టాక్ స్టార్ట్ అయ్యింది. ఇది ఎంతమేర నిజమో వేచి చూడాలి.