పవన్ కళ్యాణ్ సినిమాలు ఏమైవుతాయో.!

‘వకీల్ సాబ్’ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఒకదాని తర్వాత ఒకటిగా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదారు ప్రాజెక్టులు ఓకే చేసి పెట్టేశారు. ఆ నేపథ్యంలో 2022లో పవన్ కళ్యాణ్ నుండి కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ కావల్సి ఉంది.

‘భీమ్లా నాయక్’ పేరుతో వస్తున్న మలయాళ రీమేక్ ‘అయ్యప్పనుం కోషియమ్’ షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. అలాగే, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరి హర వీరమల్లు’ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా ఈ దసరాకి స్టార్ట్ అయ్యి సెట్స్ మీదకి వెళ్లనుంది. అంటే మిగిలిన ప్రాజెక్టుల సంగతి అటుంచితే, ఈ మూడు సినిమాల రిలీజ్‌‌లు పక్కా.

అయితే, తాజా పరిణామాల దృష్ట్యా పవన్‌ చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టాయి. పరిశ్రమ ఒకవైపు. పవన్ కళ్యాణ్ ఒక్కడే ఇంకో వైపు అన్నట్టుగా మారింది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో, అందరి సహకారంతో ఈ సినిమాలు పూర్తి చేయడం పవన్ కళ్యాణ్‌కి కత్తి మీద సామే అని చెప్పక తప్పదు.

పవన్ నిర్మాతలు కూడా తాజా పరిణామాల పట్ల ఆందోళన చెందుతున్నారట. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఆయా సినిమాలు పూర్తి చేయడం సాధ్యమేనా.? మరి, ఈ వివాదాలు అప్పటికి సమసిపోతాయా.? వేచి చూడాలిక.