Raviteja Role In Megastar Film : చిరు సినిమాలో రవితేజ పాత్ర ఎలా ఉంటుందో తెలిసిపోయింది.!

Raviteja Role In Megastar Film : ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి మరిన్ని ఆసక్తిగా మల్టీ స్టారర్ చిత్రాలు వస్తున్నాయి. అయితే సరిగ్గా గమనిస్తే వీటిలో రానున్న చిత్రాల్లో సీనియర్ స్టార్ మాస్ హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమాలే ఎక్కువ ఉన్నాయని చెప్పాలి.

ఈ ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే “ఆచార్య” నుంచి తర్వాత చేస్తున్న రెండు రీమేక్ సినిమాలూ “గాడ్ ఫాదర్” మరియు “భోళా శంకర్” లు కూడా అలాగే తెరకెక్కుతున్నాయి.

అయితే ఇవి కాకుండా డైరెక్ట్ గా చేస్తున్న ఇంకో సినిమా కూడా మల్టీ స్టారర్ గానే తెరకెక్కుతుంది. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో 154వ సినిమాగా ప్లాన్ చెయ్యబడింది.

అయితే ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే తాను ఈ సినిమాలో చిరు కి తమ్ముడుగా కనిపిస్తారని గాసిప్స్ ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా ఇంకో ఆసక్తికర సమాచారం రవితేజ పాత్రకి చెంది వినిపిస్తుంది. ఈ సినిమాలో రవితేజ చిరు కి తమ్ముడులానే కాకుండా క్రాక్ సినిమాలో ఓ పిల్లాడికి తండ్రిగా కనిపించినట్టు ఈ సినిమాలో కూడా ఒక తండ్రి రోల్ లో కనిపిస్తాడట.

అలా చిరుకి తమ్ముడుగా కనిపిస్తాడని ఇండస్ట్రీ వర్గాలలో సమాచారం. మరి ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.