Bheemla Nayak : బిగ్ క్లారిటీ : “భీమ్లా నాయక్” రిలీజ్ పై ఓపెన్ అయ్యిన నిర్మాత.!

Bheemla Nayak : ప్రస్తుతం మన టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం “భీమ్లా నాయక్” కూడా ఒకటి. మలయాళ సినిమా అయ్యప్పణం కోషియం కి రీమేక్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని చిత్ర బృందం ఆల్రెడీ కంప్లీట్ చేసేసి రిలీజ్ కి సిద్ధంగా పెట్టుకున్నారు.

ఇక ఈ క్రమంలో ఈ సినిమాపై హైప్ కూడా వేరే లెవెల్లో నెలకొంది. దీనితో రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు డైరెక్ట్ గా ఈ చిత్ర నిర్మాత నాగవంశీ నుంచే బిగ్ క్లారిటీ వచ్చింది. తాను నిర్మాణం వహించిన మరో చిత్రం “డీజే టిల్లు” చిత్రం రిలీజ్ సందర్భంగా ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూ లో భీమ్లా నాయక్ రిలీజ్ పై కూడా ఓపెన్ అయ్యారు.

ఇప్పుడు ఏపీలో సమస్యలు పరిష్కారం అయ్యాయి. కొత్త రేట్లు నైట్ కర్ఫ్యూ 100 శాతం సీటింగ్ పెట్టారు కాబట్టి ఈ రానున్న ఫిబ్రవరి 25నే రిలీజ్ చెయ్యాలి అనుకుంటున్నామని కన్ఫర్మ్ చేశారు. అంటే భీమ్లా బ్లాస్ట్ ఈ నెలలోనే కన్ఫర్మ్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ మాటలు అందిస్తున్న సంగతి తెలిసిందే.