జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదైంది. ఆ దేశ రాజధాని ఫుకుషిమా తీరంలోని 60 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైందని ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది.. భూకంపం ప్రభావం 297 కిలోమీటర్ల దూరం నుండి టోక్యో వరకు కనిపించినట్లు పేర్కొంది. భూకంపం కారణంగా సుమారు 20 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ తెలిపింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియలేదు.