వంద కాదు రెండు వందలు కాదు.. 5600 ఏళ్ల క్రితం నాటి మమ్మీ. దాన్ని చూస్తేనే సగం చచ్చిపోతాం. సాధారణంగా చనిపోయిన వాళ్లను చూడాలంటేనే కొందరికి భయమేస్తుంది. అటువంటిది 5600 సంవత్సరాల క్రితం చనిపోయిన మనిషి శరీరాన్ని చూడాలంటే భయపడకుండా ఉంటామా? అందులోనూ 5600 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి శరీరం ఏమాత్రం పాడవకుండా అలాగే ఉంటే ఇంకెలా ఉంటుంది. ఒళ్లు జలదరించదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలు ఆ మమ్మీవే.
మమ్మీలు అంటేనే ఈజిప్ట్. ఈజిప్ట్ అంటేనే మమ్మీలు. వందలు, వేల ఏళ్ల క్రితం చనిపోయిన వారిని పూడ్చిపెట్టకుండా.. ప్రత్యేక పద్ధతిలో దాచిపెట్టి వాటిని మమ్మీలుగా తయారు చేస్తారు. ఈజిప్టియన్లు ఇప్పుడే కాదు వేల ఏళ్ల సంవత్సరాల క్రితం నుంచి చనిపోయిన వారి శరీరం పాడవకుండా ఎంబాల్మింగ్ ప్రక్రియను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది.
ఫ్రెడ్ అనే 5600 ఏళ్ల క్రితం నాటి మమ్మీ మీద పరిశోధకులు పరిశోధన చేయగా నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. దాన్ని చెక్ చేయగా… అద పాడవకుండా ఉండేందుకు అప్పట్లోనే ప్రాచీనకాలంలో ఈజిప్టియన్లు ఎంబాల్మింగ్ ప్రక్రియను పర్ ఫెక్ట్ గా ఉపయోగించారు.
ఫ్రెడ్ అనే మమ్మీని 1901 నుంచి టురిన్ లో ఉన్న ఈజిప్టియన్ మ్యూజియంలో ఉంది. అయితే.. 1901 లో ఆ మమ్మీని తీసుకొచ్చి మ్యూజియంలో దాచినప్పుడు అది పాడవకుండా ఎటువంటి ఎంబాల్మింగ్ ప్రక్రయను ఉపయోగించలేదట. దాన్ని మ్యూజియంలో దాచి 100 ఏళ్లు దాటినప్పటికీ.. ఇప్పటికీ అది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉదంట.
అంటే.. 5600 సంవత్సరాల క్రితమే మమ్మీని భద్రపరచడానికి ఎటువంటి పద్ధతులు ఉపయోగించారో.. అవి చాలా పర్ ఫెక్ట్ అని పరిశోధకులు చెబుతున్నారు. ఫ్రెడ్ ను సాధారణ పద్ధతుల్లో కాకుండా… ప్రత్యేకమైన పద్ధతుల్లో.. సహజసిద్ధంగా భద్రపరచినట్టు పరిశోధకులు గుర్తించారు.