Boxoffice Report Of KGF : బాక్సాఫీస్ రిపోర్ట్ : “కేజీఎఫ్ 2” ఈ మూడు ఏరియాల్లో 3 రోజుల వసూళ్ల డీటెయిల్స్.!

Boxoffice Report Of KGF :  మళ్ళీ ఇండియన్ సినిమా పేరు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్ లో వినిపిస్తుంది. గత నెలలో అయితే మన తెలుగు సినిమా ట్రిపుల్ ఆర్(RRR) నమోదు చేసిన బాక్సాఫీస్ వండర్స్ కోసం అంతా మాట్లాడుకోగా ఇప్పుడు ఇదే ప్రపంచ సినిమా దగ్గర కన్నడ సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2” కోసం అంతా ఆసక్తిగా చెప్పుకుంటున్నారు.
అయితే దీనికి కారణం ఈ సినిమా అందుకున్న విజయం ఒకటి కాగా దానితో ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు కూడా మరో కారణం అని చెప్పాలి. అయితే ఈ మూడు రోజుల్లో మూడు కీలక ప్రాంతాలకి సంబందించిన వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి.
మొదటగా మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టు అయితే ఈ మూడో రోజుకి గాను 10.3 కోట్ల షేర్ వసూలు కాగా ఈ మూడు రోజుల్లో 42 కోట్లకి పైగా షేర్ ని అందుకుంది. ఇక హిందీ బాక్సాఫీస్ దగ్గర చూస్తే అక్కడ మాత్రం ఈ సినిమా పెర్ఫామెన్స్ మామూలుగా లేదని చెప్పాలి.
అక్కడ మూడవ రోజుకి గాను 42.9 కోట్ల వసూళ్లు రాబట్టగా ఈ మూడు రోజులకి గాను 143 కోట్లు మార్క్ ని చేరుకుందట. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి స్ట్రాంగ్ గా కొనసాగుతుందట. మరి అక్కడ యూఎస్ మరియు ఆస్ట్రేలియా వసూళ్లు చూసినట్టు అయితే 39.2 కోట్లు వసూలు చేసిందట.
ఓవరాల్ గా అయితే ఈ మూడు రోజుల్లో కేజీఎఫ్ 2 సినిమా సాలీడ్ కలెక్షన్ నే అందుకుందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.