Ram Charan: రామ్ చరణ్ ఒక్క పాట కోసం 23 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన శంకర్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా ద్వారా రామ్ చరణ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. రామ్ చరణ్ కు తన తండ్రి చిరంజీవి గారి సపోర్ట్ ఉన్నప్పటికీ తన సొంత టాలెంట్ తో ఎదిగారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తున్నాయి.

శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు అంటే ఆ సినిమా బడ్జెట్ కొన్ని కోట్ల రూపాయల విలువ ఉంటుంది. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలలో పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటికోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గత ఏడాది సెప్టెంబర్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలు పెట్టారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా లో రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడానికి అన్ని సిద్ధం చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాలవల్ల సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా మళ్లీ వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా మీద పూర్తిగా కాన్సెంట్రేట్ చేశాడు.

తాజాగా ముంబైలో సినిమాలోని ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ షెడ్యూల్ లో శంకర్ హీరో, హీరోయిన్ పాటను తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ పాటకోసం శంకర్ ఏకంగా 23 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ తో షూట్ చేయబోతున్నారు. ఈ పాట కోసం హాలీవుడ్ డాన్సర్లు, టెక్నీషియన్లు పని చేయబోతున్నారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించనున్నారు. ఈ పాట కోసం భారీ సెట్ నిర్మించి అందులో పాటని తెరకెక్కించబోతున్నారు అని సమాచారం. ఈ సినిమా గురించి మరొక ఇంట్రెస్టింగ్ విషయం చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా నాన్‌ థియేట్రికల్‌ హక్కులను జి స్టూడియోస్ 200 కోట్లకు కొనుగోలు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.