Pawan Kalyan: సినీ నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నిర్మాతలతో పవన్ కళ్యాణ్ కు చాలా మంచి అనుబంధం ఉంది అలాంటి వారిలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఒకరు. దాదాపు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలన్నీ కూడా ఈయన నిర్మాణంలోనే ఉన్నాయి. ఇక ఈయన చేయబోయే సినిమాలు కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైనే రాబోతున్నాయి.
ఇక వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ విశ్వప్రసాద్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. నిజానికి ఈయన జనసేన పార్టీ నుంచి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు కానీ కూటమిలో భాగంగా ఈ ప్రాంతం బీజేపీ నేతలకు వెళ్లింది.. ఇలా కూటమి పార్టీకి ఎంతో మద్దతు తెలిపిన టీజీ విశ్వప్రసాద్ పార్టీ అధికారంలోకి రావడంతో పెద్ద ఎత్తున అందరికీ ఘనంగా పార్టీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా తాజాగా టీజీ విశ్వప్రసాద్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. టీజీ విశ్వప్రసాద్ కోసం పవన్ కళ్యాణ్ 120 ఎకరాలు గిఫ్ట్ గా ఇచ్చారని సమాచారం. కర్నూలులోని ఓర్వకల్లులో కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైన భూమిని కేటాయించడంతో ఇప్పుడు మరొకసారి టీజీ విశ్వప్రసాద్ వార్తలలో నిలిచారు. పవన్ కళ్యాణ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై మొదటి దశలో 15 చిత్రాలు నిర్మించాలని ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది.
టీజీ విశ్వ ప్రసాద్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఎన్నో వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ వ్యాపారాలలో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం కావడంతోనే ఆయనకు వేలకోట్ల విలువచేసే భూములను కానుకగా ఇచ్చారంటూ వార్తలు వినపడుతున్నాయి. ఇప్పుడు ఈ మెబిలిటీ పార్కుతో పాటుగా ఈ స్కూటర్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారట. తైవాన్, చైనా, కొరియా వంటి దేశాలకు చెందిన కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలియజేశారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో భూమిని ఇచ్చారనే విషయం బయటకు రావడంతో ఇది కాస్త పలు చర్చలకు కారణం అవుతుంది.