ఏ హీరోకైనా వరుసగా రెండు లేదా మూడు మహా అయితే ఐదారు ఫ్లాప్ సినిమాలు పడతాయి. అదే ఏకంగా 11 ఫ్లాప్ సినిమాలు పడితే ఎలా ఉంటుంది. తట్టుకోవడం చాలా కష్టం. యంగ్ హీరో ఆది సాయి కుమార్ పరిస్థితి ఇదే. బ్రిలియంట్ యాక్టర్ సాయి కుమార్ వారసుడిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయి కుమార్. ఆరంభంలో మొదటి సినిమాగా ‘ప్రేమ కావాలి’ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. రెండవ చిత్రంగా ‘లవ్లీ’ చేసి మెప్పించాడు. పర్వాలేదు మంచి సినిమాలే చేస్తున్నాని అనుకునేలోపు ఆయనకు ఫ్లాపుల పర్వం మొదలైంది.
‘సుకుమారుడు’ చిత్రంతో మొదలైన ఫ్లాపుల పర్వం వరుసపెట్టి సాగుతోంది. ఆ తర్వాత ‘గాలిపటం, రఫ్, గరమ్, చుట్టాలబ్బాయ్, నెక్స్ట్ నువ్వే, బుర్రకథ’ లాంటి డిజాస్టర్లు అందుకున్నాడు. ఎంతసేపటికీ మాస్ హారోగా ఎలివేట్ అవ్వాలనే తపనలో పరాజయాలపాలవుతున్నాడు. చివరగా ఆది చేసిన ‘శశి’ సినిమా గత శుక్రవారం విడుదలైంది. అతి తక్కువ బడ్జెట్లో సినిమా రూపొందింది. బిజినెస్ కూడ మూడున్న కోట్లు మాత్రమే జరిగింది. బ్రేక్ ఈవెన్ మహా అయితే నాలుగు కోట్లే ఉంటుంది. అది కూడ రాబట్టలేకపోయింది సినిమా. మొదటిరోజు కేవలం 16 లక్షల షేర్ మాత్రమే తెచ్చుకుని డబుల్ డిజాస్టర్ దిశగా పోతోంది. దీంతో ఆది ఖాతాలో 11వ ఫ్లాప్ పడింది. ఇకనైనా ఆది మేల్కొని కథాబలమున్న సినిమాలు చేస్తే వరుస ఫ్లాపుల నుండి బయటపడొచ్చు.