గత ఎన్నికల్లో పవన్ పూర్తిగా వెనకబడిపోవడానికి గల ప్రధాన కారణాల్లో మీడియా సపోర్ట్ లేకపోవడం కూడా ఒకటి. ఉన్న ఛానెళ్ళు, పేపర్లు రెండు ప్రధాన పార్టీల నడుమ చీలిపోయి పనిచేయడంతో ఎవరూ పవన్ మీద ఫోకస్ చేయలేదు. పైగా జనసేనను విమర్శించడానికి పెద్దగా అవకాశాలు లేకపోవడంతో చేసేది లేక అతన్ని వార్తల్లో లేకుండా చేయడమే మేలు అనుకుని రెండు వర్గాల మీడియా పూర్తిగా ఆయన్ను పక్కన పెట్టేసింది. దీంతో జనంలోకి జనసేన సిద్దాంతాలు బలంగా వెళ్ళలేకపోయాయి. అదే పార్టీని దెబ్బ కొట్టింది. అసలు పవన్ రాజకీయాల్లోకి ఎందుకొచ్చారు, ఆయన లక్ష్యం ఏమిటి అనేది గ్రామస్థాయిలోకి విస్తృతంగా వెళ్లలేదు.
Read More : రెబల్ క్వీన్ ఏమిటిలా దులిపేస్తోంది!
అదే ఓట్ల శాతం తగ్గడానికి కారణం. ఇక సొంత మీడియా ఉండటం వలన వైసీపీ ఎంతలా లాభపడిందో అందరికీ తెలుసు. అందుకే మొదటి నుండి జనసేన కోసం సొంత మీడియా వ్యవస్థ ఉండాలని శ్రేణులు భావిస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ మనసులో కూడా సొంత మీడియా ఆలోచనలు చాలా కాలంగా ఉన్నాయి. కానీ తగినంత ఆర్థిక బలం, రాజకీయ శక్తుల మద్దతు లేకపోవడంతో ఇన్నాళ్ళు ఆయన ఆగుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను అమలుచేసే ప్రణాళిక సిద్దమవుతున్నట్టు జనసేన శ్రేణులు చెప్పుకుంటున్నాయి.
Read More : నన్ను పదే పదే వేధించారన్న రెజీన
ఎందుకంటే సొంత మీడియా ఏర్పాటుకు కావలసిన వనరులు ఇప్పుడు పవన్ వద్ద ఉన్నాయి. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆయన అడ్వాన్సుల రూపంలో భారీ రెమ్యునరేషన్లు అందుకున్నారు. ఇక సన్నిహితులు ఎలాగూ ఉన్నారు. పైగా కేంద్ర ప్రభుత్వం భాజపాతో పొత్తులో ఉండటం మూలాన ఆయన్ను ఎవరూ అడ్డుకోవడం, ఇబ్బందులకు గురిచేయడం లాంటివి ఉండవు. సో.. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది కాబట్టి సొంత మీడియా వ్యవస్థ ఏర్పాటుకు ఇదే సరైన టైమ్ కూడ. మరి పవన్ కార్యాచరణను ఎంత త్వరగా ఆరంభిస్తారో చూడాలి.