లోకేష్ కు దూరంగా ఉంటున్న తెలుగు తమ్ముళ్లు

తెలుగుదేశం పార్టీలో కొత్త కమిటీలు కొత్త తలనొప్పులు తెచ్చిపెతుడుతున్నాయి. ఇంత కాలం అధినేతపై లోలోపల రగిలిపోయిన నేతలు ఇప్పుడు తాజా పరిణామాలతో తమ అసహనాన్ని బహిరంగంగానే వెల్లగక్కుతున్నారు. మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకోలేకపోయినా అనుచరుల మధ్య తన అభిమతాన్ని చెప్పుకుంటూ బాధపడుతున్నారంటా. నేతల అలకలకు ఇటీవల ప్రకటించిన కొత్త కమిటీలే కారణమని సమాచారం.

దీంతో చంద్రబాబే నేరుగా రంగంలోకి దిగాల్సి వస్తోంది. అసంతృప్తులను బుజ్జగించేందుకు ఆయనే నేరుగా మాట్లాడుతున్నారంటా. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం అప్పగించే క్రమంలో అందరికీ న్యాయం చేయాలేకపోయానని తన సర్దిచెప్తున్నారంటా. గుంటూరు జిల్లాకు చెందిన ఆలపాటి రాజేంద్రప్రసాద్, కృష్ణాజిల్లాలో చురుకుగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి నేతలకు కూడా పదవులు ఇవ్వలేకపోయానని చంద్రబాబు అసంతృప్తులకు సర్ది చెప్తున్నారంటా.

టీడీపీకి మూడు ఎంపీ సీట్లు ఉండగా వీరిలో….. వీరిలో గల్లా జయదేవ, రామ్మోహన్ నాయుడలను పదవులు వరించాయి. కానీ విజయవాడ ఎంపీ కేశినేని నానికి మాత్రం దక్కలేదు. విజయవాడకు చెందిన పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ పార్టీలో యాక్టివ్‌త్వగా ఉంటున్నారు.. అధికార పార్టీని ఇరుకునే పెట్టేలా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అయినా ఆమెకు కూడా పదవి దక్కలేదు. మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి కూడా అసహనంతో ఉన్నారని సమాచారం.
త్వరలో ప్రకటించే రాష్ట్ర కమిటీల్లో వీరందరినీ అవకాశం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారంటా. ఇదిలా ఉండగా అవకాశాలు దక్కని వాళ్లు నారా లోకేష్ జిల్లా పర్యటనలకు దూరంగా ఉంటున్నారంటా.