పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2019ఎన్నికల్లో పోటీచేసిన రెండు చోట్ల దారుణంగా పరాజయం పాలవ్వడం, జనసేన పార్టీకి కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు రావడం వంటి అంశాలు పవన్ ను మానసికంగా ఇబ్బంది పెట్టాయి. అందుకేనేమో ఏపీలో టీడీపీ వర్సస్ వైసీపీగా కన్పిస్తుంది తప్ప .జనసేన పార్టీ కనీస ఉనికిని కూడా కాపాడుకోలేకపోతుంది. ఎన్నికల ఓటమి నుంచి ఇంకా తేరుచుకున్నట్లు కన్పించడం లేదు. అడుపదడుపా ఒకటో రెండో కార్యక్రమాలకు పరిమితవడం.. ట్వీటర్లలో ప్రతి రొజూ పోస్టు పెట్టడం మినహా పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష పోరాటాలకు దిగడానికి కూడా భయపడుతున్నాడు. జనసైనికులు మాత్రం పవన్ కల్యాణ్ పై పోరాడమని ఒత్తిడి పెంచే యత్నం చేస్తున్నారు.
నిజానికి పవన్ పాలిటిక్స్ లో యాక్టివ్ లేకపోతే కిందిస్థాయి నేతలంతా వైసీపీ లేదా టీడీపీ వైపు వెళ్లే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో జనసేనకు దాదాపు 6శాతం ఓట్లు వచ్చాయి. కేవలం 10వేల ఓట్ల తేడాతో 35సీట్లను జనసేన కొల్పోయినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల్లోని ముఖ్యనేతలు పవన్ సినిమాల్లోకి వెళ్లారనే సాకుతో ఒక్కొక్కరు ఇతర పార్టీకి జంప్ అవుతున్నారు. గతంలో పవన్ కల్యాణ్ తాను సినిమాలు చేయనని రాజకీయాల్లో ఫుల్ టైమ్ ఉంటానని ప్రకటించాడని వారు గుర్తుచేసి మరీ పార్టీని వీడుతుండటంతో ప్రజల్లో పవన్ పై అసహనం పెరుగుతుంది.
నిజానికి పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన జనసైనికులు మాత్రం అంతగా పట్టించుకోవడం లేదు. పవన్ యాక్టివ్ పాలిటిక్స్ చేయకపోవడంతో కిందిస్థాయి నేతలు నిరుత్సాహానికి గురవుతున్నారు. అయినప్పటికీ వారిని పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదు. అసలు పవన్ కల్యాన్ పార్టీ విషయంలో ఏం ఆలోచిస్తారనేది తేల్చుకునేందుకు జనసైనికులు సిద్ధమవుతున్నారట. పవన్ ను త్వరలోనే కలిసి అసలు పార్టీని నడిపిస్తారా? లేదా అని ఖరాఖండీగా అడగాలని డిసైడ్ అని పార్టీవర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇప్పటికే మెగాబ్రదర్ నాగబాబు జనసేన పార్టీకి అంటిముంటనట్లే ఉంటున్నాడు. ఎలాగూ చిరంజీవి వైసీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి మెగాస్టార్ బహిరంగంగానే మద్దతు తెలిపిన సంగతిని జనసైనికులు గుర్తుచేసుకుంటున్నారు. అన్నిటికి మించి పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తుపెట్టుకొని ఆ పార్టీని భుజాన మోస్తుండటంతో జనసేన పార్టీ కూడా ప్రజారాజ్యం పార్టీలా మారుతుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. మరి దీని పై పవన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.