జూనియర్ ఎన్టీఆర్ కోసం మైతలాజికల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న కొరటాల శివ !

Koratala Siva NTR movie

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ ఆ సినిమా తర్వాత కొరటాల శివతో సినిమా చేయటానికి సిద్ధమయ్యాడు. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా మంచి హిట్ అవటంతో జూనియర్ ఎన్టీఆర్ కొరటాలతో సినిమా చేయటానికి అంగీకరించాడు. అయితే ఇటీవల కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సినిమా విషయంలో కొరటాల చాలా జాగ్రత్తలు తీసుకొని కథలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం.

తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ కోసం ముందు అనుకున్న కథతో కాకుండా కొరటాల సరికొత్త స్టోరీతో ముందుకు వచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. హిందూ పురాణాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన గరుడ పురాణం లోని ఒక అంశం ఆధారంగా ఎన్టీఆర్ కోసం కొరటాల కథ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గరుడ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి. వీటిలో ఏ పాయింట్ ను తీసుకుని కథ సిద్దం చేస్తున్నాడో చూడాలి.

ఇలా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా స్క్రిప్ట్ మారాటంతో ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై ఇంతకాలం అయినా కూడా ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ప్రారంభించకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర సంతృప్తికి గురవుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానుల్ని కొంతవరకు శాంత పరిచేల మరొక వార్త కూడా వినిపిస్తోంది. అనుకున్న విధంగా కథ మొత్తం సెట్ అయితే నవంబర్ లోనే సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.