ఇన్సైడ్ బజ్ : మహేష్ – త్రివిక్రమ్ సినిమాకి కొత్త రిలీజ్ డేట్ లాక్ చేసేసారా?

టాలీవుడ్ ఆల్ టైం హ్యాండ్సమ్ హాంక్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. తన కెరీర్ లో ఇది 28వ సినిమా కాగా దర్శకుడు త్రివిక్రమ్ తో తనకిది హ్యాట్రిక్ సినిమా కూడా. దీనితో ఆడియెన్స్ లో భారీ స్థాయి అంచనాలు నెలకొనగా..

సినిమా షూటింగ్ ని కూడా చిత్ర యూనిట్ ఆల్రెడీ స్టార్ట్ చేసారు. ఇక ఈ భారీ సినిమాని సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తుండగా తాజాగా సినీ వర్గాల్లో సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి క్రేజీ బజ్ బయటకి వచ్చింది. మరి ఈ సమాచారం ప్రకారం అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి రిలీజ్ నుంచి తప్పుకుందట.

మరి షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా లేదని చిత్ర బృందం కొత్త డేట్ ని లాక్ చేసినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ డేట్ అండ్ మంత్ ఎప్పుడో కూడా కాదు మహేష్ కెరీర్ లో భారీ హిట్స్ ఉన్న ఆగష్టు నెలలో ప్లాన్ చేసారని తెలుస్తుంది.

అలాగే ప్రస్తుతానికి అయితే ఆగష్టు 11న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టుగా ఇప్పుడు గట్టి సమాచారం. దీనితో అయితే ఈ చిత్రం ఆగష్టు లో రావడం కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ సినిమాలో అయితే పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ కాగా థమన్ సంగీతం ఇస్తున్నాడు..