షాకింగ్ : యూఎస్ బాక్సాఫీస్ లో పవన్, మహేష్ సినిమాలు దాటి “సీతా రామమే”.!

మన సినిమాల వసూళ్ళలో యూఎస్ నుంచి వచ్చే వసూళ్లు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మరి అలా ఈ ఏడాది అయితే చాలానే సినిమాలు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర డాలర్స్ వర్షం కురిపించాయి. అయితే వాటిలో ఇక్కడ తెలుగు స్టేట్స్ లో వసూళ్ల పరంగా ప్లాప్ అయ్యినటువంటి చిత్రాల్లో అక్కడ హిట్ అయ్యి లాభాలు వచ్చినవి కూడా ఉన్నాయి.

ఇక ఈ ఏడాది భారీ హిట్స్ లో అయితే సందేహం లేకుండా మొట్ట మొదటి స్థానంలో మెగా ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ ట్రిపుల్ ఆర్(RRR) నిలవగా షాకింగ్ ఈ మొదటి వారం పూర్తయ్యి రెండో వారం లోకి ఎంటర్ అయ్యేసరికి మాత్రం లేటెస్ట్ “సీతా రామం” సినిమా భారీ వసూళ్లతో నిలిచి ట్రేడ్ వర్గాలకి షాకిచ్చింది.

రెండో శనివారం ఏకంగా ఈ చిత్రం 78 వేలకి పైగా డాలర్స్ రాబట్టి అదరగొట్టింది. ఇక ఈ లిస్ట్ లో అయితే మన టాలీవుడ్ స్టార్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు “భీమ్లా నాయక్” మరియు “సర్కారు వారి పాట” చిత్రాలు కూడా సీతా రామం సినిమా తర్వాత స్థానంలోనే నిలిచాయి.

దీనిబట్టి యూఎస్ బాక్సాఫీస్ దగ్గర సీతా రామం ఆదరణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా ఈ సినిమాలో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా రష్మికా మందన్నా కీలక పాత్రలో నటించింది. అలాగే హను రాఘవపూడి ఈ సినిమా దర్శకత్వం వహించాడు.