జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీమ్ లో ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ షో ద్వారా పాపులర్ అయిన వారు ఇప్పుడు జబర్దస్త్ నుండి వెళ్లిపోయారు. అటువంటివారిలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కూడా ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి జబర్దస్త్ మంచి అవకాశం కల్పించింది. ఈ షో ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డారు. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం సుడిగాలి సుదీర్ గెటప్ శ్రీను వంటివారు జబర్దస్త్ నుండి వెళ్ళిపోయారు.

మొదట మెజీషియన్ గా తన కెరీర్ ప్రారంభించిన సుడిగాలి సుధీర్.. వేణు వండర్స్ టీమ్ లో స్క్రిప్ట్ రైటర్ గా జబర్దస్త్ లో అడుగుపెట్టాడు. ఆ సమయంలోనే గెటప్ శ్రీనుకి కూడా వేణు టీమ్ లో అవకాశం ఇచ్చాడు. ఇలా ఇద్దరూ కొంత కాలంలోనే తమ ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఆటో రాంప్రసాద్ కూడా తన పంచ్ లతో ప్రేక్షకులను అలరించడంతో వీరు ముగ్గురు కలిసి ఒక టీంగా స్థిరపడ్డారు. ప్రతీ వారం వీరు ముగ్గురు జబర్ధస్త్ స్టేజ్ మీద చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వీరి ద్వారా జబర్ధస్త్ రేటింగ్స్ మరింత పెరిగాయి.

అయితే ఇప్పుడు జబర్ధస్త్ లో వీరి రెమ్యూనరేషన్ గురించి చర్చ జరుగుతోంది. జబర్దస్త్ సుధీర్ టీం లో ఒక్కక్కరికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చేవారన్న విషయం గురించి తెలుసుకుందాం. సుధీర్ టీం లో గెటప్ శ్రీను, సుధీర్ ఇద్దరికీ రెమ్యునరేషన్ సమానంగా ఉండేది. వీరిద్దరికీ ఒక్కొక్కరికి 2 లక్షలకు పైగా రెమ్యునరేషన్ ఇచ్చేవారు. ఇక ఆటో రామ్ ప్రసాద్ కి కూడా లక్ష పైనే ఇచ్చేవారని సమాచారం. కానీ ప్రస్తుతం సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో సుధీర్, శ్రీను జబర్దస్త్ మానేసి సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో ఆటో రాంప్రసాద్ టీం లీడర్ గా మారి యధావిధిగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో రాంప్రసాద్ రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగే ఉంటుంది.