Home News కేసీఆర్ ఎక్కడ..? ఇప్పుడిదే ట్రెండింగ్

కేసీఆర్ ఎక్కడ..? ఇప్పుడిదే ట్రెండింగ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ శైలి వివాదాస్పదమైంది.  రెండు రోజుల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య 3700 వరకు చేరిన నేపథ్యంలో కేసీఆర్ అందుబాటులో లేరనే వార్తలు సంచలంగా మారాయి.  ప్రధానంగా హైదరాబాద్ సిటీలో పలు ఏరియాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది.  పైగా ప్రజాప్రతినిధులకు సైతం కరోనా సోకుతుండటంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతోంది.  ఎన్నో రోజుల నుండి పరీక్షల సంఖ్య పెంచుతామని అంటున్న సర్కార్ ఇప్పటి వరకు రోజుకు కనీసం 6000 కు కూడా చేరకపోవడం గమనార్హం.  
 
ఇప్పటివరకు తెలంగాణలో 1,10,545 టెస్టులు చేయగా 22,312 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  పైగా ప్రగతి భవన్ లో 20 మంది  సిబ్బందికి కరోనా సోకిందనే వార్తలు రావడంతో కేసీఆర్ ఫామ్ హౌజుకు వెళ్లిపోయారనే వార్తలు బాగా ప్రచారంలో ఉన్నాయి.  దీంతో సోషల్ మీడియాలో #WhereIsKCR అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది.  దీని మీద నెటిజన్లు హైదరాబాద్లో ఇంతటి విషమ పరిస్థితుల్లో ఉండగా ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లారు, ఏం చేస్తున్నారు, కార్యాచరణ మీద ఎలాంటి ప్రకటనలూ లేవే అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. 
 
వైరస్ ప్రమాదకర స్థాయిలో ఉండగానే ప్రాజెక్టుల ప్రారంభం, హరిత హారం లాంటి కార్యక్రమాలతో  ప్రభుత్వం పెద్ద ఎత్తున జన సమీకరణాలు చేయడంతో ప్రజాప్రతినిధులకు కూడా సోకిందనే విమర్శలు వస్తున్నాయి.  జూన్ 28న లాక్ డౌన్ మీద ప్రకటన చేసిన తర్వాత గజ్వేల్ ఫామ్ హౌజుకు వెళ్లిపోయారని, సిటీలో ప్రమాదకర పరిస్థితులు ఉండటంతోనే అక్కడికి వెళ్లిపోయారాని అంటున్నారు.  మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే కేసీఆర్ బయటికి రావాల్సిందే. 
- Advertisement -

Related Posts

కేజీఎఫ్ 2 క్లైమాక్స్ కోసం అన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారా..!

సౌత్ సినీ ప‌రిశ్ర‌మ స్థాయి నానాటికి పెరుగుతూ పోతుంది. బాలీవుడ్ రేంజ్‌లో మ‌నోళ్ళు సినిమాలు తీస్తుండే స‌రికి హిందీ నిర్మాత‌లు కూడా మ‌న సినిమాపై ఓ క‌న్నేస్తున్నారు. అంతేకాదు మ‌న సౌత్‌లో హిట్టైన...

సంక్రాంతి హంగామా ముగిసింది … ఇక సినిమాల సందడి మొదలైంది !

కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్లు పున:ప్రారంభం అయినప్పటికీ సినీ పరిశ్రమల్లో అంతగా సందడి కనిపించడం లేదు. థియేటర్లలో సందడి అంతంతమాత్రమే కనిపించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతి వేళ థియేటర్లు...

శ్రీవారి పింక్ డైమండ్ వివాదం .. మళ్లీ విచార‌ణ అవ‌స‌రం లేదన్న హైకోర్టు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి చెందిన పింక్‌ డైమండ్‌ విషయంలో మ‌రోసారి విచారణ అవ‌స‌రం లేద‌ని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై విచార‌ణ జ‌రిపించాలంటూ వ‌చ్చిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో జోక్యానికి నిరాకరించింది....

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రిని కొట్ట‌డానికి మార్ష‌ల్స్ నేర్చుకున్నాడో తెలిస్తే, షాక‌వుతారు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప్ర‌స్తుతం ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న గురించి ఏ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన అది ఆస‌క్తిక‌రంగానే ఉంటుంది. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మార్ష‌ల్ ఆర్ట్స్...

Latest News