అమెరికాలో బిర్లా కూతుర్ని రెస్టారెంట్ నుంచి గెంటేశారంటా

టాటాలు, బిర్లాలు గురించి మనందరికి తెలిసిందే కదా. ఈ అపకుబేరులకు మన దేశంలో జరిగే రాచమర్యాదలు అన్నీ ఇన్నీ కావు. బడా బడా నేతలే వీళ్ల అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తుంటారు. డబ్బుకున్న పవర్ అది. ఇక్కడంటే అంతా గుర్తు పడతారు కాబట్టి ఇబ్బంది లేదు. కాని పరాయిదేశానికి వెళ్లినప్పుడు ఇక్కడ దొరికే రాచమర్యాదలు అక్కడ కూడా దొరకాలని ఏమీ లేదు కదా. కాస్త ఒపిగ్గా మసలుకోవాలి. అదే జరిగింది ఆదిత్య గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లాకు. ఓ రెస్టారెంట్ కు వెళ్తే అక్కడ సరిగ్గా రిసీప్ చేసుకోలేదు. చిరాకేసి నాలుగు మాటలంటే ఓకంగా రెస్టారెంట్ నుంచి గెంటేసినంత పని చేశారంటా… పోనీ అప్పటీ అర్థం చేసుకోవద్దూ అమ్మాయి గారు…తనకు జరిగిన పరాభవాన్ని ట్వీట్టర్ లో పోస్టు పెట్టి నెట్టింట్లో రచ్చ చేస్తోంది.

అసలు ఏం జరిగిందంటే… కుమార్ మంగళం బిర్లా కూతురు అనన్య బిర్లా క్యాలిఫోర్నియాలో ఓ ఇటాలియన్-అమెరికన్ రెస్టారెంట్ కు తల్లితో కలిసి భోజనానికి వెళ్లింది. అయితే తనపట్ల సదరు రెస్టారెంట్ ఉద్యోగులు జాతి వివక్ష చూపించారని ఆవేదనతో ట్విట్ చేసింది. దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదేంటని ప్రశ్నించినందుకు రెస్టారెంట్ నుండి గెంటేసినంత పనిచేశారని మండిపడ్డింది.

మంచి పేరున్న రెస్టారెంట్ కాబట్టే అక్కడ భోంచేసేందుకు ఏకంగా మూడు గంటలు ఎదురు చూశామని తీరా తమ వరకు వచ్చేసరికి ఇలా బయటకు గెంటేస్తారా అని నెట్టింట్లో ప్రశ్నించింది. మీ వెయిటర్ జోషువా సిల్వర్‌మాన్ మా అమ్మతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా… జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారంటూ కుమార మంగళం బిర్లా భార్య పేరును కూడా మధ్యలోకి లాగింది. ఇది ముమ్మాటికి జాతి వివక్షే అంటూ ట్వీట్‌ చేసింది. ఇక ఇంకేముంది అసలే కుబేరులకే కుబేరుల ఇంటి ఆడపడుచు ఇలా ట్వీట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆమెపై తెగ సానుభూతి ఒలకబోశారు చాలా మంది. ముమ్మాటికి జాతి వివక్షే అన్నారు మరికొంత మంది. అసలు అక్కడ స్పాట్ లో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అదండీ సంగతి. పెద్దింటి ఆడబిడ్డవు… ఎందుకమ్మా సోషల్ మీడియాలో అల్లరి చేసుకుంటావు అని ఎవరూ చెప్పలేదు సుమండీ.