మలయాళంలో జీతూ జోసెఫ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. ఈ మధ్య బసిల్ జోసెఫ్ చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జీతూ జోసెఫ్ దర్శకుడిగా, బసిల్ జోసెఫ్ హీరోగా వచ్చిన ‘నూనక్కళి’ సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో రాబోతోంది. సెప్టెంబర్ 13న ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం జీ5లో అందుబాటులో ఉండనుంది. ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించిన ఈ క్రమంలో..
దర్శకుడు జీతూ జోసేఫ్ మాట్లాడుతూ.. ‘‘జీవితంలో ఎదురయ్యే అనూహ్య మలుపులను, నవ్వులతో అందంగా మల్చిన చిత్రం నూనక్కళి. ‘ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అతి తక్కువ దూరం నవ్వు’ అని, ఈ సినిమాతో కుటుంబ సభ్యులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. బసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటోనీ తమ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఓనమ్ పండుగ సమయంలో విడుదలవుతుండటంతో వీక్షకులు ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆస్వాదించగలరని ఆశిస్తున్నాము. థియేటర్‌లలో పొందిన ప్రేమ మా అంచనాలకు మించినది. ఇక ఇప్పుడు ZEE5 ద్వారా మన అందరి వద్దకు రాబోతోంది. కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, మన దైనందిన జీవితంలో అంతర్లీనంగా ఉన్న హాస్యాన్ని కూడా గుర్తు చేసేలా ఉంటుంది’ అని అన్నారు.
బసిల్ జోసెఫ్ మాట్లాడుతూ.. ‘రోజువారీ మలయాళీ యువతను ప్రతిధ్వనించే పాత్రలను పోషించేందుకు నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాను – నూనక్కళితో మరోసారి అలాంటి ఓ పాత్రను పోషించాను. ఇందులో నేను ఎప్పుడూ అబద్ధాలు చెబుతూ, ఏదో ఒక చిక్కుముడి సమస్యతో ఉంటాను. థియేటర్లలో మాకు ఆడియెన్స్ మంచి విజయాన్ని అందించారు. ఇక ఇప్పుడు మా చిత్రం ZEE5లో ప్రీమియర్ అవుతున్నందుకు సంతోషిస్తున్నాను’ అని అన్నారు.
https://x.com/ZEE5Telugu/status/1832253909295100043
ZEE5 గురించి…
జీ5 భారతదేశపు యంగస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్లర్‌గా ప్రసిద్ధి పొందింది. మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. గ్లోబల్ కంటెంట్ పవర్ హౌస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్) నుంచి శాఖగా మొదలైంది జీ5. అత్యద్భుతమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్రరీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఎడ్‌టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్షకులను రంజింపజేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావడంతో జీ5 12 భాషల్లో అత్యద్భుతమైన కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించగలుగుతోంది.