జోరుగా హుషారుగా చిత్రం నుంచి లిరిక‌ల్ వీడియో విడుద‌ల

బేబి చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప్రేక్ష‌కుల హౄద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానం సంపాందించుకున్న విరాజ్ అశ్విన్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ క‌థానాయిక‌. అను ప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు. శిఖ‌ర అండ్ అక్ష‌ర ఆర్స్్ట ఎల్ఎల్‌పీ ప‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి శ‌నివారం ఓ ల‌వ్‌మెలోడీ లిరిక‌ల్ వీడియోను హీరో శ్రీ‌విష్ణు విడుద‌ల చేశారు.

ఓ క‌ల‌లా…నువ్వ‌లా.. నిజమ‌య్యావే నువ్వు బంగారు బొమ్మ యువ‌రాణి యువ‌రాణి అంటూ కొన‌సాగే ఈ పాట‌ను స‌ర‌స్వ‌తి పుత్ర రామ‌జోగ‌య్య శాస్త్రి ర‌చించ‌గా, ర‌ఘు మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో విరాజ్ అశ్విన్‌, పూజిత‌ల‌పై చిత్రీక‌రించారు. ఆర్మ‌న్ మాలిక్‌, న‌వ్య‌స‌మీర ఈ పాట‌ను ఆల‌పించారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ‌విష్ణు మాట్లాడుతూ… ఈ చిత్రం సాంగ్ చూస్తుంటే ఇదొక జెన్యూన్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా అనిపిస్తుంది. సాంగ్ చాలా బాగుంది. సినిమా కూడా విజయం సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ… ఈ సాంగ్ చాలా క్యాచీగా వుంది. కొత్త‌ద‌నంతో కూడిన క‌థ‌తో ఓ ల‌వ్ఎంట‌ర్‌టైన‌ర్‌లా ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. త‌ప్ప‌కుండా ఈ చిత్రం నా కెరీర్‌కు మ‌రో మంచి స‌క్సెస్‌ఫుల్ చిత్ర‌మ‌వుతుంది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ… నేటి యువ‌త‌రం న‌చ్చే అంశాల‌తో అన్ని ఎమోష‌న్స్‌తో రూపొందుత‌న్న ఈ చిత్రం కొత్త‌ద‌నం ఆశించే అంద‌రికి న‌చ్చుతుంది. త్వ‌ర‌లోనే చిత్ర విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం అని తెలిపారు.

కొత్త‌ద‌నంతో నిండిన చిత్రాల‌కు విడుద‌ల విష‌యంలో నా స‌పోర్ట్ ఎల్ల‌ప్పూడు వుంటుంద‌ని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తెలిపారు. ఈ స‌మావేశంలో ద‌ర్శ‌కుడు అను ప్ర‌సాద్‌, కెమెరామెన్ మ‌హిరెడ్డి పందుగుల త‌దిత‌రులు పాల్గోన్నారు.

విరాజ్ అశ్విన్‌, పూజిత పొన్నాడ‌, సాయికుమార్‌, రోహిణి, మ‌ధునంద‌న్‌, సిరి హ‌నుమంతు, సోనూ ఠాకూర్‌, బ్రహ్మ‌జీ , చ‌మ్మ‌క్ చంద్ర‌, క్రేజీ క‌న్నా.