‘అఖండ’ చిత్రంతో ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో యమ బిజీగా దూసుకెళుతున్నారు. ‘అఖండ’ తోనే బాలయ్యలో మరింత హుషారు కనిపిస్తోంది. ఫుల్ ఎనర్జీతో ‘వీర సింహారెడ్డి’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. రెట్టింపు ఉత్సాహంతో ‘వీర సింహారెడ్డి’ రూపంలో సంక్రాంతి సమరానికి కూడా సిద్ధమయ్యారు.
ఈ చిత్రం తర్వాత ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీ లీల నటించనుంది. అలాగే ఇందులో బాలయ్యకు జోడీ గా ఒక యంగ్ హీరోయిన్ నటించబోతున్నట్లు ఇండస్ట్రీటాక్.
బాలకృష్ణ 108వ సినిమాలో ప్రియాంక జవాల్కర్ నటించబోతున్నట్లుగా తెలిసింది. బాలయ్యతో సినిమా చేసిన తర్వాత ఈమె ఫేట్ మారుతుందని సోషల్ మీడియా వేదికగా అందరూ తమ పోస్టులను పెడుతున్నారు. మొదట విజయ్ దేవరకొండ తో కలిసి ‘ టాక్సీవాలా; చిత్రంలో నటించిన ఈ ముద్దు గుమ్మ ఎంట్రీతోనే మంచి విజయాన్ని అందుకుని క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ చిత్రం తరువాత కిరణ్ అబ్బవరంతో కలిసి ‘SR. కళ్యాణ మండపం’ సినిమాలో నటించింది. ఈ చిత్రం కూడా జవాల్కర్ కు మంచి పేరునే తెచ్చిపెట్టింది. అయితే.. ఆ తర్వాత మరిన్ని చిత్రాల్లో నటించినా ఎందుకోగానీ సక్సెస్ కాలేకపోయింది. దీనితో జవాల్కర్ కెరీర్ సందిగ్ధంలో పడినట్లయింది.
ఇలాంటి తరుణంలో బాలయ్య వంటి సీనియర్ హీరోకు జోడీగా అవకాశం రావడం ఆమె కెరీర్ కు బాగా హెల్ప్ కానుందని ఇండస్ట్రీ పెద్దలు, ఆమె అభిమానులు భావిస్తున్నారు. అయితే.. బాలయ్య చిత్రంలో ఈ ముద్దుగుమ్మ నటిస్తోందో లేదో ఇంతవరకు చిత్ర బృందం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి బాలయ్య నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం విడుదల తర్వాతనే ప్రియాంక జవాల్కర్ విషయం అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది. అదీ..విషయం.