‘రైటర్ పద్మభూషణ్’ ఫిబ్రవరి 3, 2023న థియేటర్లలో విడుదల

చాయ్ బిస్కెట్‌ లో యూట్యూబ్ వీడియోలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన సుహాస్, అద్భుతమైన ప్రతిభ గల నటుడిగా వైవిధ్యమైన పాత్రలు, చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ‘కలర్ ఫోటో’లో అద్భుతమైన నటన కనబరిచాడు. ఈ చిత్రం జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. ఇటివలే హిట్-2లో అందరినీ ఆశ్చర్యపరిచాడు. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న తన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్‌’లో స్ట్రగులింగ్ రైటర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా థియేట్రికల్ విడుదల తేదీని ప్రకటించారు.

రైటర్ పద్మభూషణ్ ఫిబ్రవరి 3, 2023న థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీ పోస్టర్ జీవితంలో పెద్ద లక్ష్యాలను కలిగి ఉన్న సాధారణ యువకుడిగా కనిపించాడు సుహాస్‌. చక్కని చిరునవ్వుతో ప్రకాశం బ్యారేజీపై నిలబడి పోజు ఇవ్వడం ఆకట్టుకుంది.

విజయవాడ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటిస్తోంది. లహరి ఫిల్మ్స్ తో కలిసి చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్, శరత్, చంద్రు మనోహర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మనోహర్ గోవిందస్వామి సమర్పిస్తున్నారు.

శేఖర్ చంద్ర సంగీతం అందించిన చిత్రంలోని ఫస్ట్ సింగిల్ కన్నుల్లో నీ రూపమే చార్ట్‌బస్టర్‌ గా నిలిచింది.

ఈ చిత్రానికి వెంకట్ ఆర్ శాకమూరి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్రం ట్రైలర్‌ ను త్వరలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

తారాగణం: సుహాస్, టీనా శిల్పరాజ్, ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు రమణ, శ్రీ గౌరీ ప్రియ

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: షణ్ముఖ ప్రశాంత్
నిర్మాతలు: అనురాగ్, శరత్, చంద్రు మనోహర్
సమర్పణ: మనోహర్ గోవింద్ స్వామి
బ్యానర్లు: చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ : వెంకట్ ఆర్ శాకమూరి
ఎడిటర్: పవన్ కళ్యాణ్ కోదాటి, సిద్ధార్థ్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: కళ్యాణ్ నాయక్
ఆర్ట్: ఎల్లయ్య ఎస్
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: సూర్య చౌదరి
పీఆర్వో : వంశీ-శేఖర్
కో-డైరెక్టర్: గోపి అచ్చర
క్రియేటివ్ ప్రొడ్యుసర్స్: ఉదయ్-మనోజ్