Ram Charan: డ్రగ్స్ ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు ఒక సోల్జర్ లా మారుదాం: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

‘డ్రగ్స్ నివారణ పోరాటంలో ఐక్యంగా నిలబడదాం. డ్రగ్స్ ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు ఒక సోల్జర్ లా మారుదాం’ అన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, రామ్ చరణ్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.

కార్యక్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారికి, మై బ్రదర్ విజయ్ దేవరకొండ కి, దిల్ రాజ్ గారికి మిగతా పెద్దలందరికీ థాంక్యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ కి హాయ్. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రమ్స్ వెళ్లేవాడిని. ఇక్కడ మీ అందరిని చూస్తుంటే ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసు శాఖకు ధన్యవాదాలు. ఇలాంటి అవేర్నెస్ కచ్చితంగా కావాలి.

కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని స్కూల్స్ బయట గోలి సోడాలు చాక్లెట్లు దొరికే చోట డ్రగ్స్ అమ్ముతున్నారని వార్తలు చూసి చాలా షాక్ అయ్యాను. ఇది ఇంత పెద్ద ఆర్గనైజడ్ క్రైమ్ లాగా అయిపోయిందా అని చాలా బాధేసింది. అప్పుడు నేను పేరెంట్ ని కాదు. ఇప్పుడు పేరెంట్ ని. రేపు పొద్దున్న మా పిల్లల్ని బయటికి పంపించాలంటే భయంగా ఉంటుంది.

డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తాయి. పొద్దున్నే లేచి వ్యాయామం చేసి, మన వర్క్ పూర్తి చేసి. ఇంటికి వచ్చి ఓ ఆట ఆడుకుని, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడంలో రియల్ హై ఉంటుంది. ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమా తీసినప్పుడు ఒక హై ఉంటుంది. మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక హై. ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం హై. గేమ్స్ ఆడటం ఒక హై.

మనందరం కూడా డ్రగ్స్ రహిత సమాజం కోసం పోరాడాలి. మన భవిష్యత్తుని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. మేము అందరం తెలంగాణ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నాం. డ్రగ్స్ ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు ఒక సోల్జర్ లాగా మారాలి. అందరికీ థాంక్ యూ’అన్నారు.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నియంత్రణ దినోత్సవ కార్యక్రమానికి నాతోపాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన యువ మిత్రులు ఫిలిం ఇండస్ట్రీలో ఒక నూతన శకాన్ని ప్రారంభించిన రామ్ చరణ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు ఈ వేదికపై ఉన్న మేము ఎవరు కూడా పెద్దపెద్ద బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాదు. చిరంజీవి గారు ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి దేశమే గర్వించదగ్గ మహానటుడుగా మంచి మనిషిగా గుర్తింపు పొందారు. దాదాపు 50 సంవత్సరాల నిరంతర శ్రమ కఠోర దీక్షతో వాళ్లు రాణించగలిగారు. ఎన్ని కష్టాలు వచ్చినా కృంగిపోలేదు మాదకద్రవ్యాలు వైపు చూడలేదు. వ్యసనాల వైపు బానిసలు కాలేదు.

ఎన్ని కష్టాలను వచ్చినా ఎదుర్కునే ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. రామ్ చరణ్ నాకు స్కూల్ కి వెళ్ళినప్పుడు నుంచి తెలుసు నా కళ్ళముందే స్కూల్ కి వెళ్లే కుర్రాడు రియల్ స్టార్ లాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించి ఈరోజు ఆస్కార్ అవార్డుని సాధించి దేశానికి ఒక గౌరవం తెచ్చి పెట్టాడు. ఇది మామూలు గౌరవం కాదు. చిరంజీవి గారి పేరు ఉంటే మన ఇళ్లల్లో ఫంక్షన్ కి పిలుస్తాను. కానీ ఆస్కార్ అవార్డు ఇవ్వలేము. కష్టపడ్డాడు కాబట్టి అవార్డు వచ్చింది. దానికి కారణం దీక్ష పట్టుదలతో ఆ రంగంలో రాణించడం. అందుకే మీ అందరికీ చెప్తున్నాను సినిమాలో వాళ్ళు పోషించే పాత్రలు కాదు రియల్ లైఫ్ లో వారిని ఆదర్శంగా తీసుకోండి. డ్రగ్స్ నిర్మూలనకు అందరూ సామాజిక బాధ్యత తీసుకొని సమాజంలో హీరోలుగా నిలబడండి.’అన్నారు.

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గారికి, పెద్దలందరికీ నమస్కారం. ఒకసారి వైజాగ్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కోసం ఒక బైట్ అడిగితే ఇచ్చాను. అప్పుడు నాకు అంత సీరియస్ గా ఈ సమస్య గురించి అవేర్నెస్ లేదు. కానీ కొంతకాలం తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ ఇది ఎంత పెద్ద సమస్యో చెప్పిన తర్వాత తప్పకుండా ఈ విషయంలో అవేర్నెస్ కల్పించాలనిపించింది. ఎవరు కూడా ఇలాంటి సిచువేషన్ ఫేస్ చేయకూడదు.

ఇది మన బాధ్యతలాగా అనిపించింది. మనకి మన హెల్త్ ముఖ్యం. హెల్త్ లేకపోతే ఏమీ చేయలేం. యువతని పాడు చేస్తే ఒక దేశాన్ని పాడు చేసినట్టే. ఒక్కసారి దానికి అలవాటు పడితే ఇంకా జీవితంలో మరో లక్ష్యం అంటూ ఉండదు. మన దేశం మనం నెంబర్ వన్ లో ఉండాలంటే డ్రగ్స్ ని రానివ్వకూడదు. డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తుంది. జీవితంలో ఆనందం కావాలంటే వ్యాయామం చేయండి. డబ్బులు సంపాదించండి. అప్పుడు సమాజం గౌరవిస్తుంది. మన పేరెంట్స్ గర్వపడతారు. అందరికీ థాంక్యూ’అన్నారు.

టీఎఫ్డీసీ చైర్మన్‌, నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వర్ రెడ్డి గారికి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి. విజయ్ దేవరకొండ గారి,కి పెద్దలందరికీ నమస్కారం. తొమ్మిది నెలల క్రితం ముఖ్యమంత్రి గారితో ప్రయాణం చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేయాలని ఆయన చెప్పారు. అలా నిర్మూలించాలంటే అందరం కంకణం కట్టుకోవాలని ఆయన చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నా వంతు ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను గాని నా కుటుంబ సభ్యులు గానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోకుండా నేను చేయగలుగుతాను. నాలాగే మీరందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం మొత్తం డ్రగ్స్ లేకుండా చేయగలుగుతాం.

ఇలాంటి అవేర్నెస్ మనందరికీ అవసరం. ఈమధ్య మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో ఒక నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకుని ఎవరైనా పట్టుబడితే ఆ ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని నిర్ణయించారు. దీనిపై మాట్లాడి తెలుగు ఇండస్ట్రీలో కూడా అది పాటించేలాగా చేస్తాం. అందరం ప్రతిజ్ఞ తీసుకుంటే మన రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని రాష్ట్రంగా చేయగలుగుతాం. థాంక్యూ’ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Public EXPOSED: Ys Jagan Arrest Plan || Singaiah Death Case || Ap Public Talk || Chandrababu ||