Laila : విశ్వక్సేన్ ‘లైలా’ నుంచి ఫీమేల్ లుక్ రిలీజ్- టీజర్ జనవరి17న విడుదల

మాస్ కా దాస్ విశ్వక్సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘లైలా’. ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్ ఫస్ట్ సింగిల్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో విశ్వక్సేన్ అమ్మాయి- అబ్బాయిగా కనిపించనున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే ను మోడల్‌ నిరిలీజ్ చేశారు. రోజు సంక్రాంతి సందర్భంగా, మేకర్స్ ఫీమేల్ లుక్ ని రిలీజ్ చేశారు.

పోస్టర్‌లో విశ్వక్సేన్ అని గుర్తించడం కష్టం, ఎందుకంటే అతను అద్భుతమైన మేకప్ తో అచ్చు అమ్మాయిలా కనిపిస్తున్నారు చుట్టూ తిరుగుతున్న సీతాకోకచిలుకలు ఎగురుతూ, లైలా పెదవులపై వేలుతో నిశ్శబ్దాన్ని వ్యక్తపరిచే సింబాలిక్ ఫోజ్ లో కనిపిస్తుంది.

పింక్ కలర్ థీమ్ అమ్మాయి ఎలిగెన్స్ ని జోడిస్తుంది. లైలా పాత్రలో విశ్వక్ సేన్ అద్భుతంగా ట్రాన్స్ ఫర్మేషన్ కావడం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా టీజర్‌ను జనవరి 17న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఆకాంక్ష శర్మ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.

నటీనటులు: విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: షైన్ స్క్రీన్స్
నిర్మాత: సాహు గారపాటి
దర్శకత్వం: రామ్ నారాయణ్
రైటర్: వాసుదేవ మూర్తి
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

కలలో అమ్మవారు వచ్చారు | Eluru Prashanthi Latest Interview | Eluru Keerthi Prashanthi | Telugu Rajyam