విశ్వక్ సేన్ చేతుల మీదుగా “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” నాలుగవ సాంగ్ లాంచ్

గతం లో “పెళ్లి చూపులు” వంటి హిట్ సినిమా ని అందించిన టాలీవుడ్ నిర్మాణ సంస్థ బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్. పతాకం పై త్వరలో విడుదల కాబోతున్న 6వ సినిమా నే “అన్నపూర్ణ ఫోటో స్టూడియో- ఇచ్చట అందమైన ఫోటోస్ తీయబడును” అనే ఆసక్తికరమైన క్యాప్షన్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. చెందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ సినిమా లో “30 వెడ్స్ 21” వెబ్ సిరీస్ ఫేమ్ చైతన్య రావు హీరోగా నటించగా, లావణ్య అతనికి జంటగా నటించింది. ఈ మధ్యనే సినిమా నుండి విడుదలైన మోషన్ పోస్టర్ తో పాటు మూడు పాటలకు ప్రేక్షకుల మంచి స్పందన వచ్చింది. తాజాగా ఇప్పుడు సినిమా నుంచి నాలుగవ పాటను యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన చేతుల మీదుగా విడుదల చేశారు.

“ఓ ముద్దుగుమ్మ” అంటూ సాగే ఈ పాట చాలా బాగుంది. ఇది ఒక రొమాంటిక్ పాట. శ్రేష్ఠ అందించిన లిరిక్స్ చాలా అర్థవంతంగా ఉన్నాయి. ప్రిన్స్ హెన్రీ అందించిన మ్యూజిక్ కూడా వినసొంపుగా ఉంది. మ్యూజిక్ తో పాటు తన వాయిస్ తో కూడా హెన్రీ బాగా మెప్పించారు. ముఖ్యంగా లిప్సిక గొంతు పాట కి బాగా సూట్ అయ్యింది. సినిమా పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. వీడియో లో చూపించిన విజువల్స్ కూడా చాలా బాగున్నాయి.

ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “ముందుగా చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. చైతన్య తో కలిసి సినిమా చెయ్యలేదు కానీ ముఖ చిత్రం సినిమా నుండే నాకు పరిచయం. తన సినిమా పాటని లాంచ్ చేయడం చాలా సంతోషం గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీలో చాలా కాలం ఉంటారని అనిపిస్తోంది. సాంగ్ అదిరిపోయింది. ముద్దుగుమ్మ పాట చాలా బాగుంది. వింటున్నప్పుడే నేను కూడా హమ్ చేస్తున్నాను. ఈ సినిమాతో చైతన్య మరొక సర్ప్రైజ్ ఇస్తాడు. మూవీ యూనిట్ కి గుడ్ లక్. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, పర్ఫామెన్స్ లు, పీరియడ్ సెటప్ చాలా తక్కువ సార్లు ఇంత బాగా కుదురుతాయి. పాట చూసినప్పుడు ఈ సినిమాలో కూడా అన్ని బాగా కుదిరాయి అని నాకు అనిపించింది” అని అన్నారు.

హీరో చైతన్య రావు మాట్లాడుతూ… “మొదటిగా పిలవగానే వచ్చినందుకు విశ్వక్ కి పెద్ద థాంక్స్. విశ్వక్ ది ఒక బైట్ చాలా పాపులర్ అయింది. పరిచయం అయితే నా అంత మంచివాడు లేడు అని కానీ పరిచయం కాకపోయినా కూడా విశ్వక్ అంత మంచివాడు ఎవరు ఉండరు. తను స్నేహం కోసం మా కోసం ఇది చేసి ఉండచ్చు కానీ యంగ్ టీమ్ గా తన లాంటి స్టార్ మా పాట లాంచ్ చేయడం మాకు పెద్ద విషయం. తను నాకు వెళ్లిపోమాకే సినిమా నుండి తెలుసు. నేను కూడా తన స్థాయి కి ఎదగాలి అని కోరుకుంటున్నాను. చిత్ర బృందం కూడా సినిమా కోసం బాగా కష్టపడ్డారు. మంచి సినిమా తో మీ ముందు వస్తున్నాము” అన్నాడు చైతన్య.

గీత రచయిత శ్రేష్ట మాట్లాడుతూ.. ” బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ లో నేను చేస్తున్న మూడవ సినిమా ఇది. హెన్రీ గారు మరియు చందు గారు ఈ పాటని చాలా బాగా వచ్చేలా చేశారు. ఇంతకుముందు విడుదలైన మూడు పాటలు కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. దానికి చాలా సంతోషంగా ఉంది. పెళ్లిచూపులు సినిమా ఎంత పెద్ద టైంలో ఈ సినిమా కూడా అంతే మంచిది కావాలని కోరుకుంటున్నాను. విశ్వక్ గారు ఈ పాటని లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.

డైరెక్టర్ చందు ముద్దు మాట్లాడుతూ “ముందుగా విశ్వక్ సేన్ గారికి నా కృతజ్ఞతలు. శ్రేష్ఠ గారు మంచి లిరిక్స్ ఇచ్చారు. ప్రిన్స్ హెన్రీ గారు చాలా బాగా పాడారు. మిగతా మూడు పాటల లాగా ఈ పాట కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.

మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ మాట్లాడుతూ, “అందరికీ నా కృతజ్ఞతలు. ఈ పాట కోసం మేము చాలా కష్టపడ్డాము. ఇది ఒక మంచి పాట. నేను, లిప్సిక గారు, రితేష్ కలిసి పాడాము. ఈ పాటని మీరు బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.

ఈ వేసవిలోనే విడుదలకు సిద్ధమవుతోన్న అన్నపూర్ణ ఫోటో స్టూడియో చిత్రంలోనటీనటులు : చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య తదితరులు.

సాంకేతిక నిపుణులు : సంగీతం – ప్రిన్స్ హెన్రీ, సినిమాటోగ్రఫీ – పంకజ్ తొట్టాడ, ఎడిటర్ – డి వెంకట్ ప్రభు, పీఆర్వో – జీఎస్కే మీడియా, బ్యానర్ -బిగ్ బెన్ సినిమాస్, నిర్మాత – యష్ రంగినేని, రచన దర్శకత్వం – చెందు ముద్దు.

Lyrical Video: O Muddhugumma Song | Annapoorna Photo Studio |Chaitanya,Lavanya |Prince Henry |Yash R