సక్సెస్ సెలెబ్రేషన్స్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ

టాలీవుడ్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ బేబీ సినిమా కల్ట్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటనకు, నిర్మాతగా ఎస్‌కేఎన్ అభిరుచికి, సాయి రాజేష్ దర్శకత్వంపై ముఖ్య అతిథులు విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, నాగబాబు, మైత్రీ మూవీ మేకర్స్ వై రవి శంకర్ ప్రశంసలు కురిపించారు. ఈ ఈవెంట్‌లో

నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ – మేము విజయ్ తో హిట్ కొడితే ఎస్కేఎన్ ఆనంద్ తో సక్సెస్ ఫుల్ మూవీ చేశాడు. ఈ సారి ఆనంద్ తో మేము హిట్ కొడతాం. విజయ్ తో నువ్వు సక్సెస్ ఫుల్ సినిమా చేయాలి. అల్లు అరవింద్ గారు ఉంటే బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సినిమా బేబీ బడ్జెట్ తో తెరకెక్కి హల్క్ హిట్ అందుకుంది. టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా.అన్నారు

నాగబాబు మాట్లాడుతూ – సాయి రాజేశ్ రూపొందించిన గత చిత్రాలు హృదయ కాలేయం, కొబ్బరిమట్ట నాకు చాలా ఇష్టమైన సినిమాలు. కొబ్బరిమట్ట సినిమాను చాలాసార్లు చూసి ఎంజాయ్ చేశాను. ఈ సినిమాను ఇంత బాగా తెరకెక్కిస్తాడని ఊహించలేదు. జనసేన పార్టీకి సాయి రాజేశ్ చాలా సపోర్ట్ చేశాడు. ఆనంద్ తనకు తానుగా ఎదిగాడు. వైష్ణవి, విరాజ్, ఆనంద్ ముగ్గురూ బాగా నటించారు. ఒక రియల్ సక్సెస్ పొందిన సంతోషం మీ అందరిలో కనిపిస్తోంది. సాయి రాజేశ్ ఇలాంటి సీరియస్ సినిమాలు చేస్తూ కామెడీ మూవీస్ వదిలేయద్దు. వాటికి నా లాంటి ఫ్యాన్స్ ఉన్నారు. అని చెప్పారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ – ఈ సినిమా చూసొచ్చి మా కోడలు మామయ్య మీ పేరు టైటిల్స్ లో లేదు అని అడిగింది. ఎస్కేఎన్ కథ తీసుకొచ్చాడు. తన దగ్గర డబ్బులు లేవన్నాడు. నేను ఇస్తాను చేయరా అని అన్నాను అని ఆమెకు చెప్పాను. అలా బేబీ గీతా ఆర్ట్స్ సినిమా అయ్యింది. సాయి రాజేశ్ ను చూస్తే ఇంత బాగా ఆలోచించి మూవీ చేస్తాడని అనిపించలేదు. ఆనంద్, విరాజ్, వైష్ణవి ముగ్గురు బాగా నటించారు. చివరలో బ్రిడ్జి సీన్ దగ్గర ఆనంద్ తన నటనతో కన్నీళ్లు తెప్పించాడు.

విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ – ఈ సినిమాలోని అన్ని క్యారెక్టర్స్ ను అద్భుతంగా డిజైన్ చేశాడు మా సాయి రాజేశ్. ఇవాళ ప్రతి క్యారెక్టర్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. నటులుగా మాకు ఇలాంటి సక్సెస్ ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు. సినిమా చూశాక దర్శకుడు మారుతి గారు మీరు ఈ సినిమా సక్సెస్ విషయంలో ధైర్యంగా ఉండండి అన్నారు. ఇవాళ ఆయన మాట నిజమైంది. మా సినిమాకు సపోర్ట్ చేసేందుకు వచ్చిన విజయ్ అన్నకు థాంక్స్. అన్నారు.

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ – విజయ్ యాక్టింగ్ కు నేను ఫ్యాన్ ను. నన్ను చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ల వల్లే నేను ఇవాళ ఈ వేదిక మీద ఉన్నా. ఫ్యూచర్ లో మీకు ఇంకా మంచి పేరు తీసుకొస్తా. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అని అంటుంటారు. కానీ ప్రయత్నిస్తే నాకు బేబీ సినిమా అవకాశం వచ్చినట్లే మీకు వస్తుంది. ఈ సినిమా సక్సెస్ చూస్తుంటే ఇన్నేళ్ల నుంచి దీని కోసమే కదా కష్టపడింది అనిపిస్తోంది. మా సినిమాకు రియల్ హీరోస్ మా టెక్నీషియన్స్. అని చెప్పింది.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – నేను సినిమాల్లోకి రావాలి అనుకున్నప్పుడు అన్నకు బ్యాడ్ నేమ్ తీసుకురాకుంటే చాలు అనుకున్నా. ఇవాళ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా గర్వపడుతున్నారని అనుకుంటా. నా మీద విజయ్ కు నమ్మకం. మేమిద్దరం స్నేహితుల్లా ఉంటాం. ఈ సినిమా గురించి చెప్పాలంటే నాతో పాటు విరాజ్, విష్ణవి యాక్టింగ్ లైఫ్ ఇచ్చింది. విరాజ్ చేస్తుంటే కమల్ హాసన్ అని అరుస్తున్నారు. వైష్ణవిని మహానటి అంటున్నారు. వైష్ణవికి ఫస్ట్ మూవీలో ఇంత పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ దొరకడం ఆమె అదృష్టం. బేబీ సినిమా సక్సెస్ కాకుంటే సినిమాలు ఆపేద్దామనుకున్నా. నేను సినిమాలు చేయగలనా లేదా అని భయపడుతున్న సమయంలో మారుతి గారు ఎంతో ధైర్యాన్నిచ్చారు. మా దర్శకుడు సాయి రాజేశ్ గారు రాసిన డైలాగ్స్ మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంటుంది. అని అన్నారు.

దర్శకుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ – ఆనంద్ కు కథ చెప్పడానికి ఫస్ట్ ఎంకరేజ్ చేసింది విజయ్ గారే. ఆనంద్ తప్ప మరో హీరోను నా సినిమాకు ఊహించుకోలేదు. అతను ఈ సినిమాకు ఎంత కష్టపడ్డాడో తెలుసు. ఆ క్యారెక్టర్ మూడ్ లోకి రావడానికి, నేను చెప్పినట్లు నటించడానికి హండ్రెడ్ పర్సెంట్ అటెంప్ట్ చేశాడు. ఆనంద్ నాకు ఇచ్చిన అవకాశం ఈ సినిమా. వైష్ణవి మంచి జాబ్ చేస్తూ అవన్నీ వదులుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడి ఈ సినిమా చేసింది. విరాజ్ ఏమాత్రం ఈగో లేకుండా ఈ సినిమా చేశాడు. ఎవరికి పేరొస్తుందని ఆలోచించలేదు. మంచి సినిమా చేస్తున్నామని నమ్మాడు. ఒక హీరోకు కథ చెబుదామనుకుంటే ఆ డైరెక్టర్ అయితే కథ కూడా వినను అన్నాడు. అలాంటి టైమ్ లో ఈ ముగ్గురు నన్ను ఓ మంచి సినిమాకు దర్శకుడిని చేశారు. ఎస్కేఎన్ నా ఫ్రెండ్ అవడం నా అదృష్టం. నన్ను నమ్మి ఇన్ని కోట్ల రూపాయల గ్యాబ్లింగ్ చేశాడు. డైరెక్టర్ మారుతి గారికి మా అందరి కంటే ఎక్కువగా సినిమా మీద నమ్మకం ఉండేది. ఇలాంటి మంచి సినిమాలే ఫ్యూచర్ లోనూ చేస్తానని మాటిస్తున్నాను. అన్నారు.

నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ – ఒక ఇంట్లో ఇద్దరు హీరోలు సక్సెస్ అవడం అరుదు. విజయ్, ఆనంద్ ఇద్దరూ హీరోలుగా సక్సెస్ అవడం సంతోషంగా ఉంది. విజయ్ తో గీత గోవిందం చేశాం. ఆనంద్ తో బేబీ మా ప్రెండ్స్ బ్యానర్ లోనే వచ్చింది. ఇకపై మన కాంబినేషన్ లో మూవీస్ రావాలని కోరుకుంటున్నా. నేను , మారుతి, ఎస్కేఎన్ ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. మా ఇద్దరికీ సక్సెస్ వచ్చింది. ఎస్కేఎన్ కు వెయిటింగ్ ఇంకా అనుకున్నాం. ఈ సినిమాతో అతనికీ మంచి పేరొచ్చింది. మారుతి, సాయి రాజేశ్ ఇద్దరూ స్వతహాగా ఎదిగిన దర్శకులు. ఈ టీమ్ అందరికీ కంగ్రాట్స్. అని అన్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ – బేబీ సినిమా లోగో నేనే రాశాను. అప్పుడు సాయి రాజేశ్ కరెక్షన్స్ చెప్పాడు. టైటిల్ కే ఇన్ని కరెక్షన్స్ చెబుతున్నాడు సినిమా ఎంత చెక్కుతాడో అనుకున్నా. అలాగే 50 రోజుల నుంచి 90 రోజులకు షూటింగ్ తీసుకెళ్లాడు. ఇవాళ కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో పెరుగుతున్నాయి. ఎస్కేఎన్ టాక్సీవాలా తర్వాత మరో మంచి సబ్జెక్ట్ కోసం ఆగాడు. మాస్ మూవీ మేకర్స్ అని ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. తను ఎంతమంచి సినిమా ప్రొడ్యూస్ చేయగలడో చూపించాడు ఎస్కేఎన్. మేమిద్దరం ఇలాగే ప్రొడక్షన్ కొనసాగిస్తాం. దర్శకుడు సాయి రాజేశ్ సినిమాకు ఎంత కన్విక్షన్ తో పనిచేశాడో తెలుసు. నాకు నా తొలి సినిమా ఈ రోజుల్లో గుర్తొచ్చింది. ఆనంద్ ఎమోషన్స్ బాగా పలికించాడు. అలాంటి యాక్టర్స్ బాగా పేరు తెచ్చుకుంటారు. బేబీ టీమ్ గుర్తుండిపోయే సినిమా ఇచ్చారు. అని చెప్పారు.

నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ – మా సినిమా రిలీజైన గత నాలుగు రోజులుగా హౌస్ ఫుల్స్ తో నడుస్తోంది. ఏడాదిలో కేవలం ఐదారు సినిమాలకు మాత్రమే ఇలా జరుగుతుంది. ఇంత పెద్ద సక్సెస్ కు కారణం మా దర్శకుడు సాయి రాజేశ్. కలర్ ఫొటోతో నేషనల్ అవార్డ్ ఇచ్చాడు. ఇప్పుడు బేబీతో రివార్డ్ ఇచ్చాడు. బేబీ సినిమా బడ్జెట్ దాటిపోయినప్పుడు అల్లు అరవింద్ గారు, వాసు నాకు సపోర్ట్ గా నిలిచారు. మంచి సినిమా చేస్తున్నాడని నమ్మారు. ప్రొడ్యూసర్ గా నా మొదటి సినిమా టాక్సీవాలా. ఆ సినిమాతో నన్ను నిర్మాతను చేశారు విజయ్. ఆనంద్ తో సినిమా చేస్తున్నప్పుడు అదొక బాధ్యతగా భావించాను. నన్ను నమ్మి సినిమా ఇచ్చారని రెస్పాన్సిబిలిటీ ఫీలయ్యా. ఆనంద్ మంచి హీరో అవుతాడని నాకు ఎప్పటి నుంచో నమ్మకం ఉండేది. బేబీ సినిమాను కల్ట్ మూవీ అంటున్నారు. ఇలాంటి పేరు రావడం సంతోషంగా ఉంది. ఇకపైనా ప్రొడ్యూసర్ గా మంచి సినిమాలు చేస్తాను. అన్నారు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – బేబీ థియేటర్ లో కూర్చున్న వెంటనే ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాట వచ్చింది. అప్పుడే ఒక మంచి లవ్ స్టోరి చూపిస్తున్నారనే ఫీల్ లోకి వెళ్లిపోయాను. ఇవాళ ఈ సినిమా గురించి డిబేట్ చేస్తున్నారు. క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఒకరు చెడ్డ, మరొకరు మంచి చెప్పడం ఉద్దేశం కాదు. సొసైటీలో అన్ని రకాల వ్యక్తిత్వాలు ఉన్న వాళ్లు ఉంటారు. నాకు చాలా మంది మంచి అమ్మాయిలు స్నేహితులుగా ఉండేవారు. వారి గుడ్ ఫ్రెండ్ షిప్ తెలుసు. వైష్ణవి క్యారెక్టర్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అబ్బాయిలు కూడా లవ్ బ్రేక్ చేసేవాళ్లు ఉంటారు. దర్శకుడు సాయి రాజేశ్ హానెస్ట్ గా అటెంప్ట్ చేశాడు. అతను నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. నేను సపోర్ట్ చేసేందుకు రెడీగా ఉంటాను. అల్లు అరవింద్ గారి వల్ల వాసు గారు, మారుతి, ఎస్కేఎన్ గారు ఇలా వారి దగ్గర నుంచి ఈ టీమ్…ఒకరి సపోర్ట్ తో మరొకరు ఇలా వస్తున్నాం. మా అందరిలో మంచి కథలు తెరపై చూపించాలనే ప్రయత్నమే ఉంటుంది. ఆనంద్ తనకు తానుగా ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నాడు. ఇవాళ తన సక్సెస్ గర్వంగా ఉంది. అలాగే విరాజ్, వైష్ణవికి మంచి పేరొచ్చింది. బేబీ మీద మీ లవ్ చూపిస్తూనే ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.