వెంకటేష్ ‘సైంధవ్’ సెన్సార్ పూర్తి- U/A సర్టిఫికేట్‌ ఇచ్చిన సెన్సార్ బోర్డ్- జనవరి 13న వరల్డ్ వైడ్ రిలీజ్

విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ 75 మూవీ ‘సైంధవ్’ సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ అధికారులు U/A సర్టిఫికేట్‌ ఇచ్చారు. సైంధవ్ 2024 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా వుంది.

‘సైంధవ్’ యూనిక్ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్. పాటల్లో చూపినట్లుగా, తండ్రీ కూతుళ్ల బంధం సినిమాలో ప్రధాన అంశం, ఇందులో వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్ మధ్య మెచ్యూర్ రిలేషన్ షిప్ కూడా మనం చూడవచ్చు. తన కూతురితో కలిసి సింగిల్ పేరెంట్‌గా ఉన్న వెంకటేష్‌కి సహాయం చేయడానికి ఆమె వస్తుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా లాంటి ప్రముఖ నటుల ఈ చిత్రంలో కీలక పాత్రలలో అలరించనున్నారు.

ఈ పాన్ ఇండియా మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో నిర్మించగా, సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. ఎస్.మణికందన్ సినిమాటోగ్రఫీ అందించారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, గ్యారీ బిహెచ్ ఎడిటర్.

బేబీ సారా పాలేకర్‌తో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, జిషు సేన్ గుప్తా, జయప్రకాష్‌లు ఈ చిత్రంలో ఇతర ముఖ్య తారాగణం. కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.