వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో-కొరియన్ హారర్-కామెడీ #VT15 తో సర్ ప్రైజ్ చేయబోతున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.
హైదరాబాద్, అనంతపురం షెడ్యూల్స్ తర్వాత #VT15 షూటింగ్ ఇప్పుడు ఫారిన్ షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. వరుణ్ తేజ్, ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ హై ఎనర్జీ సీక్వెన్స్ లని చిత్రీకరిస్తున్నారు.
ఈ ఫారిన్ షెడ్యూల్‌లో టీం వైబ్రెంట్ హంటింగ్ లో డ్రాప్స్ లో స్టన్నింగ్ విజువల్స్ ని షూట్ చేస్తోంది. ఇది ప్రాజెక్ట్ కు ఇంటర్నేషన్ టచ్ ని యాడ్ చేస్తోంది. ఈ షెడ్యూల్ తో 80% షూటింగ్ పూర్తవుతుంది.
#VT15 దర్శకుడు మేర్లపాక గాంధీ, UV క్రియేషన్స్‌తో కలిసి వరుణ్ తేజ్ చేస్తున్న మొదటి సినిమా, కంచె తర్వాత ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్‌మెంట్‌తో వరుణ్ తేజ్ మరోసారి కలిసి పనిచేస్తున్నారు.
టైటిల్, గ్లింప్స్‌తో సహా మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే తెలియజేస్తారు మేకర్స్.
#VT15 మునుపెన్నడూ లేని విధంగా బిగ్ స్క్రీన్ పై హాంట్ చేసే హిలేరియస్ రైడ్ ని అందించబోతోంది.
తారాగణం: వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య
రచన, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: ఎస్ థమన్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్టాగ్ మీడియా