వరుణ్ తేజ్ #VT14 టైటిల్ ‘మట్కా’- పూజా కార్యక్రమాలతో లాంచ్

వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన 14వ చిత్రాన్ని ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్‌ దర్శకత్వంలో చేస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న #VT14 చిత్రం ఈరోజు హైదరాబాద్‌లో టీమ్, పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది.

సురేష్ బాబు, చిత్ర నిర్మాతలు ప్రొసీడింగ్స్ ప్రారంభించేందుకు దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ముహూర్తం షాట్‌కు దర్శకుడు మారుతి కెమెరా స్విచాన్ చేయగా, మెగా నిర్మాత అల్లు అరవింద్ క్లాప్‌ కొట్టారు. దిల్ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. టైటిల్ పోస్టర్‌ను హరీష్ శంకర్ లాంచ్ చేశారు.

#VT14కి ‘మట్కా’అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. టైటిల్ పోస్టర్ ప్రత్యేకంగా ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. ‘మట్కా’ అనేది ఒకరకమైన జూదం. 1958-1982 మధ్య జరిగే ఈ కథ యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నారు. కథ వైజాగ్ నేపథ్యంలో జరుగుతుంది.1958 నుంచి 82 వరకు సాగే కథలో వరుణ్ తేజ్ ని నాలుగు డిఫరెంట్ గెటప్ లలో చూడబోతున్నాం. వరుణ్ తేజ్ కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌గా ఉండే ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ కంప్లీట్ గా మేక్ఓవర్ అవుతున్నారు.

వరుణ్ తేజ్ కు జోడిగా నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి ఎంపికయ్యారు. ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ లో నోరా ఫతేహి ఒక ప్రత్యేక పాటలో కూడా అలరించనున్నారు. నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ ఇతర ముఖ్య తారాగణం.

ఈ సినిమా కోసం 60వ దశకంలో వైజాగ్‌ను తలపించే భారీ వింటేజ్ సెట్‌ను నిర్మించనున్నారు. 60వ దశకంలోని వాతావరణాన్ని, అనుభూతిని అందించడానికి చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ చిత్రానికి ఆశిష్ తేజ ప్రొడక్షన్ డిజైనర్, సురేష్ ఆర్ట్ డైరెక్టర్.

ఈ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. సౌత్‌లో అత్యంత బిజీ గా ఉన్న కంపోజర్‌లలో ఒకరైన జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ప్రియాసేత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.

యూనివర్సల్ అప్పీల్ వున్న ‘మట్కా’ పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. ఇది వరుణ్ తేజ్‌కి మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.

తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్

సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల
బ్యానర్: వైర ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డివోపీ: ప్రియాసేత్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైన్: ఆశిష్ తేజ
ఆర్ట్: సురేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఆర్కే జానా
పీఆర్వో: వంశీ-శేఖర్