తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ 2024 ఎన్నికల సందర్భంగా వి. సముద్ర గారి ప్యానెల్ తమ మేనిఫెస్టోతో ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తమ పానెల్ ఎన్నికైతే టి ఎఫ్ డి ఏ ద్వారా భవిష్యత్తుకు ఏం చేయాలి అనే ప్రణాళికతో ముందుకు వచ్చారు. ఈ సమావేశంలో దర్శకుడు వి. సముద్ర, మద్దినేని రమేష్, మధుసూదన్ రెడ్డి మరియు కస్తూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు వి. సముద్ర గారు మాట్లాడుతూ : నేను దర్శకుడిగా 18 సినిమాలు చేశాను అందులో 12 హిట్ అయ్యాయి. దాదాపు 170 మంది అసోసియేట్ డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లు నా దగ్గర నుంచి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. టి ఎఫ్ డి ఏ 2024 ఎన్నికలలో ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాను. పదవీ కాంక్షతో కాకుండా అందరికీ సేవ చేయాలి మంచి చేయాలి అనే ఆలోచనతో పోటీ చేస్తున్న. పుట్టినప్పుడు తల్లి పెరిగినప్పుడు తండ్రి ఎదిగినప్పుడు సమాజం గర్వపడాలి అనే ఆలోచన ఉండండి. ఈ టి ఎఫ్ డి ఏ ఎన్నికల్లో నన్ను ఓటేసి గెలిపిస్తే ప్రెసిడెంట్ గా నేను చేపట్టిన బాధ్యతల్ని మా మేనిఫెస్టోలో ఉన్న హామీలని కచ్చితంగా నిర్వహిస్తానని మాటిస్తున్నాను అన్నారు.
మద్దినేని రమేష్ గారు మాట్లాడుతూ : ఈసారి నేను జనరల్ సెక్రటరీగా వి. సముద్ర ప్యానల్ తరుపున పోటీ చేస్తున్నాను. గతంలో నేను దర్శకుల సంఘం లో ఈసీ మెంబర్గా ఆర్గనైజేషన్ ట్రెజరర్ గా జనరల్ సెక్రటరీగా మెట్టు మెట్టుగా ఎదిగాను. ఆరు సంవత్సరాలుగా సంఘం లో లేను. మళ్లీ ఇప్పుడు వి. సముద్ర గారు ప్రెసిడెంట్ గా ఎన్నుకొని సంఘంలో పోటీ చేయడం జరుగుతోంది. ఎప్పుడూ లేని విధంగా మూడు ప్యానల్స్ పోటీ చేయడం జరుగుతుంది. మా ప్యానల్ గెలిస్తే మేనిఫెస్టోలో ఇచ్చిన కచ్చితంగా హామీలను పూర్తి చేస్తామని అన్నారు.
మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ : నేను ట్రెజరర్ గా పోటీ చేస్తున్నాను. గతంలో టి ఎఫ్ డి ఏ నుంచి ఉన్న సభ్యులు చాలా గౌరవప్రదంగా చూసుకున్నారు. దాన్ని ఎక్కడ తగ్గించకుండా కించపరచకుండా మా పానల్ ముందుకు తీసుకెళుతుందని, ఫండ్ రైజింగ్ ద్వారా అందరికీ మంచి జరిగేలా చూస్తామని అన్నారు.
కస్తూరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ : నేను సముద్ర గారి ప్యానల్ లో జాయింట్ సెక్రెటరీగా కాంటెస్ట్ చేస్తున్నాను. ఈ సమావేశం మా భవిష్యత్ కార్యాచరణ చెప్పడానికి మాత్రమే. మిగతా పానల్స్ కూడా మా కుటుంబ సభ్యులు లాంటివారే. సినిమానైతే ప్రపంచానికి పరిచయం చేసానని వ్యవస్థలో అవస్థలు అలాగే ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని మా పానల్ తరఫున ఏం చేయగలము అనేది కచ్చితంగా చేస్తాము అని అన్నారు.