Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి అద్భుతమైన పోస్టర్‌ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) సందర్భంగా తాజాగా ఈ చిత్రం నుండి ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. త్రీ పీస్ సూట్ మరియు టోపీతో పూర్తిగా నల్లటి దుస్తులు ధరించి పవన్ కళ్యాణ్ చాలా అందంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ తన ప్రత్యేకమైన స్టైల్ మరియు స్వాగ్ కు ప్రసిద్ధి చెందారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ దానిని మరో స్థాయికి తీసుకెళుతుంది. తన సినిమాలలో హీరోలను అద్భుతంగా చూపించడంలో పేరుగాంచిన హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ కోసం తనలోని అభిమానిని బయటకు తీసుకువచ్చి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోని ఓ పాట స్టిల్‌తో అభిమానులందరికీ మరిచిపోలేని పుట్టినరోజు విందును ఇచ్చారు. అభిమానులు మరియు ప్రేక్షకుల నాడి మరెవరికీ తెలియనంతగా తనకు తెలుసని, ఈ పోస్టర్ తో మరోసారి నిరూపించారు హరీష్ శంకర్.

సెప్టెంబర్ 6న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు చిత్రీకరణలో పాల్గొంటారు. రాబోయే షెడ్యూల్‌తో టాకీ భాగం దాదాపు పూర్తవుతుంది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు.. మాస్ ప్రేక్షకులు, యాక్షన్ ప్రియులు మెచ్చేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు హామీ ఇచ్చారు.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం పనిచేస్తోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. అయనంక బోస్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, నీతా లుల్లా కాస్ట్యూమ్స్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కె. దశరథ్, రమేష్ రెడ్డి కథనం రాయగా, ప్రవీణ్ వర్మ మరియు చంద్రమోహన్ రచనా సహకారం అందిస్తున్నారు. కళా దర్శకుడిగా ఆనంద్ సాయి వ్యవహరిస్తున్నారు.

తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, ఎల్ బి శ్రీరామ్, రాంకీ, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్, జయ ప్రకాష్, వర్గీస్, మీర్ సర్వర్, ప్రవీణ్, టెంపర్ వంశీ, నవాబ్ షా, శ్రీరామ్, మాగంటి శ్రీనాథ్, కిల్లి క్రాంతి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
కథనం: కె. దశరథ్, రమేష్ రెడ్డి
రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సి. చంద్రమోహన్
ఛాయాగ్రహణం: అయనంక బోస్
కూర్పు: కార్తీక శ్రీనివాస్. ఆర్
కళ: ఆనంద్ సాయి
సీఈఓ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: దినేష్ నరసింహన్, హరీష్ పై
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, నబకాంత మాస్టర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Why Kutami Govt Ignores Vizag Steel Plant Development: Tulasi Reddy | Telugu Rajyam