త్రిష పొలిటికల్ బాట పట్టనుందా?!

సోషల్ మీడియా హడావిడి అంతా ఇంతా లేదు. విషయం ఏదైనా రచ్చ చేయడం మాత్రం పచ్చి నిజం! ఇక వినోదరంగం పై ఈ హడావిడి మామూలుగా ఉండదు. స్టార్ హీరోయిన్ల విషయంలో అయితే.. మరీ శృతిమించిపోతోంది! సరిగ్గా అందాలతార త్రిష విషయంలో ఇదే జరిగింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది త్రిష.

సౌత్ స్టార్ హీరోయిన్లలో ఈమె ఒకరు. అయితే గత కొన్నిరోజులుగా త్రిష రాజకీయాల్లోకి వస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం సోషల్ మీడియా పుణ్యమాని మరింత ఊపందుకుంది. తొలుత ఈ విషయాలను త్రిష కొట్టిపారేసింది.. నెటిజనుల పోస్టులకు ముసిముసిగా నవ్వుకుంది. అయితే.. నెటిజనులు మాత్రం పోస్టింగులు ఆపలేదు సరికదా.. మరింత రెచ్చిపోయారు.

ఇక లాభం లేదనుకున్న ఈ బ్యూటీ తాజాగా తనపై వస్తున్న వార్తలపై స్పందించి క్లారిటీ కూడా ఇచ్చేసింది. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన త్రిష తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. టాలీవుడ్ అగ్రతారలతో కలిసి నటించడం వల్ల ఆమె కెరీర్ తెలుగునాట ఊపందుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, ప్రభాస్ తో కలిసి త్రిష నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద త్గిరుగులేని విజయాన్ని అందుకున్నాయి.

గత రెండు దశబ్ధాలుగా సినిమా ఇండస్ట్రీలో కథానాయికగా కొనసాగుతోన్న త్రిష కృష్ణన్ పై ఈ మధ్య వస్తున్న రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియదు. వీటిపై ఇంతవరకు ఏమాత్రం నోరువిప్పలేదు ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్ త్రిష రాజకీయాల్లోకి రాబోతోందంటూ సోషల్ మీడియా దూమారం లేపింది. పలు భాషల్లోని స్టార్ హీరోలతో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ ఇకపై పొలిటికల్ బాట పట్టనున్నట్లు ఇండస్ట్రీవర్గాలు చర్చకు తావిస్తున్నాయి.

దీంతో ఈ ఇష్యూ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. జయలలిత. ఎంజేఆర్ తరహాలో త్రిష కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతుందని సమాచారం. త్రిష పొలిటికల్ ఎంట్రీపై రకరకాల వార్తలు, ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. త్రిష త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో త్రిష చేరబోతోందని, అందుకు ఓ స్టార్‌ హస్తం ఉందంటూ వార్తలు కోడైకూస్తున్నాయి. ఇప్పటికే లోలోపల ఆమె పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన పనులు పూర్తి చేశారని కూడా చెప్పుకుంటున్నారు. తాజాగా ఈ వార్తలపై త్రిష స్పందించింది.

తన పొలిటికల్ ఎంట్రీపై ఆమె క్లారిటీ ఇచ్చింది. తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని తేల్చిచెప్పింది. ఈ ఏడాది కెరీర్‌ చాలా సంతృప్తికరంగా ఉందని, ఇకముందు కూడా సినిమాలపైనే దృష్టి పెడతానని పేర్కొంది. త్రిష చివరగా ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రంలో నటించింది. ఈ సినిమా సెప్టెంబర్‌ 30న విడుదల అయ్యింది. సినిమా సక్సెస్‌తో మరోసారి ఆఫర్లు క్యూ కట్టాయి.

ఈ సినిమాలో త్రిష తన అందంతో మరోసారి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదలయింది. ఇందులో త్రిష కీలక పాత్రలో నటించి అన్నివర్గాల ప్రేక్షకులను తన అందంతో కట్టిపడేసింది. తెలుగులో పలువురు దర్శక నిర్మాతలు కూడా త్రిషను తమ సినిమాల్లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. అదీ..సంగతీ!!