Pre Wedding Show: ఆకట్టుకుంటోన్న తిరువీర్ ‘ప్రీ వెడ్డింగ్ షో’ నుంచి ‘వయ్యారి వయ్యారి’ లిరికల్ వీడియో

వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ప్రీ వెడ్డింగ్ షో’. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.న‌వంబ‌ర్ 7న సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

టీజర్ వచ్చిన తరువాత సినిమాపై అంచనాలు పెరిగాయి. వెడ్డింగ్ ఫోటో గ్రాఫర్ చుట్టూ ఓ ప్రేమ కథ, ఓ వింత సమస్య, దాన్నుంచి జెనరేట్ అయ్యే కామెడీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక తాజాగా ‘ప్రీ వెడ్డింగ్ షో’ నుంచి ‘వయ్యారి వయ్యారి’ అంటూ సాగే ఓ క్యాచీ లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సనారే సాహిత్యం అందరికీ అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా ఉంది. ఇక యశ్వంత్ నాగ్, సింధూజ శ్రీనివాసన్ గాత్రం ఈ పాటకు మరింత ప్రత్యేకతను చేకూర్చింది. సురేష్ బొబ్బిలి బాణీ శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. ‘వయ్యారి వయ్యారి’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ సినిమాలో హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.

Vayyari Vayyari Lyrical Video | Pre Wedding Show | Thiruveer,Teena Sravya | Suresh Bobbili |Rahul S

ఈ చిత్రానికి కెమెరామెన్‌గా కె. సోమ శేఖర్, ఎడిటర్‌గా నరేష్ అడుప, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ప్రజ్ఞయ్ కొణిగారి పని చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మేకర్లు.. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

తారాగణం : తిరువీర్, టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది

రచయిత & దర్శకుడు: రాహుల్ శ్రీనివాస్, నిర్మాతలు : సందీప్ అగరం & అశ్మితా రెడ్డి బసాని, సహ నిర్మాత : కల్పనారావు, సంగీతం : సురేష్ బొబ్బిలి, DOP : K సోమ శేఖర్, ఎడిటర్ : నరేష్ అడుప , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ప్రజ్ఞయ్ కొణిగారి , ప్రొడక్షన్ డిజైనర్ : ఫణి తేజ మూసి , కాస్ట్యూమ్ డిజైనర్లు : ఆర్తి విన్నకోట, ప్రియాంక వీరబోయిన , సాహిత్యం : సనారే , సౌండ్ డిజైనర్: అశ్విన్ రాజశేఖర్ , PRO : నాయుడు – ఫణి (బియాండ్ మీడియా) , పబ్లిసిటీ డిజైనర్: ఐడియల్ డాట్స్ , మార్కెటింగ్: హౌస్‌ఫుల్

Chandrababu Says Good News To AP People, But YCP Serious | Jagan | Telugu Rajyam