రాజా విక్రమ్ ప్రధాన పాత్రలో భరత్ నరేన్ దర్శకత్వంలో శ్రీ అక్కియన్ ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీధర్ మరిసా నిర్మించిన చిత్రం ‘దిల్ సే’. న్యూ ఏజ్ లవ్ స్టొరీగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి దిల్ సే ట్రైలర్ ని లాంచ్ చేశారు. దర్శకుడు భరత్ నరేన్ యూత్ ఫుల్ అండ్ యునిక్ లవ్ స్టొరీతో ‘దిల్ సే’ ని ప్రజంట్ చేశారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. కాన్సప్ట్ చాలా డిఫరెంట్ గా వుంది. మాస్క్ వేసుకున్న అమ్మాయి ఎవరు? అనే క్యురియాసిటీ ట్రైలర్ చూసిన అందరికీలో కలిగింది. ట్రైలర్ యంగేజింగ్ అండ్ ఫన్ ఫుల్ గా వుంది. రాజా విక్రమ్ చాలా యీజ్ తో చక్కని నటన కనబరిచారు. నటీనటులంతా ఆకట్టుకున్నారు. నేపధ్య సంగీతం, కెమరాపనితనం ప్లజంట్ గా వున్నాయి. ట్రైలర్ సిరిస్ పై క్యురియాసిటీని పెంచింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ బాబీ కొల్లి మాట్లాడుతూ.. ‘పవర్’ సినిమా విడుదలైనప్పటి నుంచి భరత్ పరిచయం. దిల్ సే ట్రైలర్ చాలా బావుంది. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశారు. ట్రైలర్ లో చూస్తుంటే అందరిలోనూ ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. రాజా విక్రమ్ ని చూస్తుంటే నా మొదటి సినిమా గుర్తుకు వచ్చింది. తను తప్పకుండా నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలని కోరుకుంటుకున్నాను. భరత్ కి ఆల్ ది బెస్ట్. ట్రైలర్ చూసి అందులో అమ్మాయి ఎవరని అడిగాను. నాకు నా వైఫ్ కి తప్పితే యూనిట్ లో ఎవరికీ చూపించలేదని చెప్పాడు. అందరికీ థ్రిల్ సర్ ప్రైజ్ ఇవ్వాలనే ఈ కన్విక్షన్ చాలా నచ్చింది . అదే ఈ సినిమాకి ప్రేత్యకతని తీసుకొచ్చింది. అలాంటి పాత్రని నమ్మి చేసిన అమ్మాయికి ఆల్ ది బెస్ట్. విన్ ఓటీటీ ఫ్లాట్ ఫాం తో యువ ప్రతిభావంతులందరినీ ప్రోత్సహిస్తున్న రామోజీరావు గారికి, బాపినీడు గారి ధన్యవాదాలు. ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అందరి కళ్ళల్లో విజయం సాధిస్తామనే నమ్మకం కనిపిస్తోంది. దిల్ సే ఖచ్చితంగా పెద్ద విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కొరుకుంటున్నాను’’
రాజా విక్రమ్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి ప్రాజెక్ట్. ట్రైలర్ లాంచ్ చేసిన బాబీ గారికి చాలా థాంక్స్. నన్ను నమ్మి ఈ పాత్రకు ఎంపిక చేసిన దర్శకుడు భరత్ కు థాంక్స్. చాలా అద్భుతమైన పాత్ర రాశారు. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం అనందంగా వుంది. ట్రైలర్ చూసిన తర్వాత వర్ష కోసం మీరంతా ఎదురుచూస్తున్నారని అర్ధమౌతుంది. వర్ష గురించి తెలుసుకోవాలంటే ఈ సిరిస్ చూడాలి. సెప్టెంబర్ 16న ఈటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరికీ థాంక్స్.’’ తెలిపారు.
దర్శకుడు భరత్ నరేన్ మాట్లాడుతూ.. ముందుగా బాబీ అన్నకి థాంక్స్. దిల్ సే నాకు చాలా పెద్ద ప్రాజెక్ట్,. మాస్క్ అనే ఐడియా ని ఎలా ముందుకు తీసుకెళ్లగలని అనిపించింది. షూటింగ్ మొదలైన తర్వాత మా చుట్టూ ఒక క్యురియాసిటీ రావడంతో ఇది చాలా పెద్ద ఫ్యాక్టర్ అని అర్ధమైయింది. ఇందులో మాస్క్ వేసుకున్న అమ్మాయి ఎవరనేది ఎదో ఒక రోజు అందరికీ తెలుస్తుంది. ఒక ఆసక్తిని కలిగించడానికే ఆమె ఎవరో చెప్పడం లేదు. తనకి చాలా మంచి పేరొస్తుంది. మా సొంత బ్రదర్ ఈ సినిమాని నిర్మించారు. మా ఫ్యామిలీకి కృతజ్ఞతలు. మా టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసింది. రాజా ఒక నటుడిగా చాలా సపోర్ట్ చేశాడు. చాలా అంకితభావంతో పని చేశాడు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నాను. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.
తారాగణం: రాజా విక్రమ్, భార్గవ్, రోహిణి రావు, రాహుల్ వర్మ, రమణ భార్గవ, వి.వి.కృష్ణ తదితరులు…
దర్శకుడు: భరత్ నరేన్
నిర్మాత: శ్రీధర్ మారిసా
బ్యానర్: శ్రీ అక్కియన్ ఆర్ట్స్
డీవోపీ: అనుష్ కుమార్
సంగీతం: అజయ్ అరసాడ
ఎడిటర్స్ : రాజమెడ, కిరణ్
కాస్ట్యూమ్స్: ప్రియాంక సూరంపూడి
ఆర్ట్: మిధున కల్చర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
పీఆర్వో : వంశీ – శేఖర్