Mysterious: అబిద్ భూషణ్ హీరోగా బిగ్ బాస్ ఫేమ్ రోహిత్ సహాని జంటగా వస్తున్న చిత్రం ”మిస్టీరియస్”.

రియా కపూర్ మరియు మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఈ చిత్ర టీజర్‌ను ఘనంగా లాంచ్ చేసింది మూవీ టీమ్ ఈ సందర్భంగా డైరెక్టర్ మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ ‘’సస్పెన్స్ జానర్ లో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ,తాజాగా టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ తో సినిమా సక్సెస్ పై మరింత కాన్ఫిడెన్స్ పెరిగిందని’’ చెప్పుకొచ్చారు.

ఇక నిర్మాతలు ఉషా మరియు శివాని మాట్లాడుతూ ‘’సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించామని ,టీజర్ అందరికీ నచ్చడం సంతోషమని,ఫ్యూచర్లో మరిన్ని మంచి సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తామని’’ తెలిపారు.

MissTerious Teaser - Ashley Creations | Abid Bhushan | Rohit Sahni | Meghna Rajput | Riya Kapoor

ఇక సినిమాలో జంటగా నటించిన అబిద్ భూషణ్, రోహిత్ సహాని మాట్లాడుతూ ‘’ఇంతమంచి అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్ ,ప్రొడ్యూసర్స్ కి చాలా థాంక్స్ అని ,ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు మంచి టాక్ తెచ్చుకోవడంతో పాటు రిలీజ్ అయిన టీజర్ కి కూడా మంచి అప్లాజ్ రావడం ఆనందంగా ఉందని’’ తమ సంతోషాన్ని పంచుకున్నారు.

ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్లో సినిమా నటీనటులు ,యూనిట్ అంతా పాల్గొని సందడి చేయడం విశేషం.

నటీనటులు : ప్రధాన తారాగణం రోహిత్ సహాని (బిగ్ బాస్ ఫేమ్),అబిద్ భూషణ్ (ప్రముఖ నటుడు రక్త కన్నీరు నాగభూషణ్ మనవడు), రియా కపూర్ (హీరోయిన్), మేఘనా రాజపుత్ (హీరోయిన్), బలరాజ్ వాడి (కన్నడ నటుడు), ఆకునూరి గౌతమ్,భోగిరెడ్డి శ్రీనివాస్, రాజమౌళి(జబర్దస్త్), గడ్డం నవీన్ (జబర్దస్త్), లక్ష్మి,,వేణు పోల్సాని

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మహి కోమటిరెడ్డి
నిర్మాత: జయ్ వల్లందాస్ (USA)
పాటలు మరియు సంగీతం: ML రాజా
కెమెరా & ఎడిటింగ్: పరవస్తు దేవేంద్ర సూరి (దేవా)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ్ ఉప్పు
పీ ఆర్వో : శ్రీపాల్ చోల్లేటి.

Public EXPOSED Chandrababu & Pawan Kalyan Ruling || Ap Public Talk || Ys Jagan || Telugu Rajyam