దళపతి విజయ్ ‘The GOAT’ పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా ఈ సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్.

‘గాయ్స్.. థిస్ ఈజ్ న్యూ ఎసైన్మెంట్.. మిమ్మల్ని లీడ్ చేయబోయేది ఒక కొత్త లీడర్. 68 సక్సెస్ ఫుల్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్. హోస్టేజ్ నోగోషియేటర్. ఫీల్డ్ ఏజెంట్..ఏ స్పై’ అనే వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఆధ్యంతం ఆడియన్స్ కు బ్రెత్ టేకింగ్ ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చింది.

విజయ్ యాక్షన్ ప్యాక్డ్ రోల్ లో డిఫరెంట్ గెటప్స్ లో అదరగొట్టారు. ట్రైలర్ చివర్లో జేమ్స్ బాండ్ ట్యూన్ ని విజయ్ హమ్ చేయడం ఎక్సయిట్మెంట్ ని పెంచేసింది. విజయ్, మీనాక్షి చౌదరి కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది. ట్రైలర్ లో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, యోగి బాబు, ప్రేమి అమరెన్ ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించారు.

వెంకట్ ప్రభు స్క్రీన్ ప్లే మాస్టర్. The GOAT నేరేటివ్ అద్భుతంగా వుండబోతోందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. ట్రైలర్ యాక్షన్ సీక్వెన్స్ లో నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా వుంది. యువన్ శంకర్ రాజా తన బీజీఎంతో యాక్షన్ ని నెక్స్ట్ లెవల్ కి ఎలివేట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. ఈ పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది.

ఈ మూవీని ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

‘The GOAT’ సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.