శ్రీ విజయకాంత్ 25-08-1952 న మధురై లో జన్మించారు. ఆయన మొదటి చిత్రం ‘ఇనిక్కుమ్ ఇలామై’ ద్వారా 1979లో 27 ఏళ్ళ వయస్సులో తమిళ సినీ రంగ ప్రవేశం చేసారు. ఆ తరువాత 40 సంవత్సరాలు సినిమాలలో నటించారు. ఆయన పోలీస్ అధికారిగా 20 కి పైగా చిత్రాలలో నటించారు,. తమిళ సినిమాలలో ఆయన ఎక్కువ సార్లు ఖాకీని ధరించారు, ఆయన నటించిన చిత్రాలు చాలా వరకు తెలుగులోనికి అనువాదమైనాయి. అవి ఇక్కడ కూడా విజయవంతం అయినాయి. వాటిలో ‘‘కెప్టెన్ ప్రభాకర్’’, ‘‘పోలీస్ అధికారి ’’ చిత్రాలు వున్నాయి. ఆయన నటించిన సినిమాల సంఖ్య సుమారుగా 150కి పైగానే వున్నాయి. 1984 లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలవడం విశేషం.
2005వ సంవత్సరంలో డీఎండీకే పార్టీ ని స్థాపించారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు.
దక్షిణ భారత కళాకారుల అసోసియేషన్ (నడిగర్ సంఘం) కి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఆయనకు ‘’కళైమ్మణి’’ 2001 సంవత్సరంలో పురస్కారం లభించినది.
శ్రీ విజయకాంత్ మృతి పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ తమ సంతాపాన్ని తెలియచేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేయడమైనది.
(వి. వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు)) (కె.యల్. దామోదర్ ప్రసాద్)
అధ్యక్షులు గౌరవ కార్యదర్శి