‘మంత్ ఆఫ్ మధు’లో నిజాన్ని నిజాయితీగా చెప్పాం: స్వాతిరెడ్డి

డిఫరెంట్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న నవీన్ చంద్ర, మంచి సినిమాల ఎంపికలో పేరుపొందిన స్వాతి రెడ్డి ‘మంత్ ఆఫ్ మధు’లో కలిసి నటిస్తున్నారు. గతంలో విమర్శకుల ప్రశంసలు పొందిన భానుమతి & రామకృష్ణ చిత్రాన్ని అందించిన దర్శకుడు శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా, యశ్వంత్ ములుకుట్ల క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ బ్యానర్‌పై దీనిని నిర్మిస్తున్నారు. సుమంత్ దామ సహ నిర్మాతగా, రఘువర్మ పేరూరి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

‘మంత్ ఆఫ్ మధు’ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఒక యూనిక్ రిలేషన్ షిప్ డ్రామా. నవీన్ చంద్ర, స్వాతిల ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ప్రధాన హైలైట్‌లలో ఒకటిగా ఉంటుంది. ఈ సినిమా టీజర్‌, ఫస్ట్‌ సాంగ్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రోజు, మేకర్స్ చిత్రం విడుదల తేదీని అనౌన్స్ చేశారు. మంత్ ఆఫ్ మధు అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో నవీన్ చంద్ర, స్వాతి అందంగా కనిపించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్ నిర్వహించింది.

ప్రెస్ మీట్ లో స్వాతి రెడ్డి మాట్లాడుతూ.. ‘మంత్ ఆఫ్ మధు’ లో మాకు తెలిసిన నిజాన్ని నిజాయితీగా చెప్పాం. మనకు చిన్నప్పుటి నుంచి ఎదో చెప్తారు, ఎదో నమ్ముతాము. కానీ రియల్ లైఫ్ డిఫరెంట్ గా వుంటుంది. ఈ సినిమాలో చూపించిన నిజం ధైర్యం ఇచ్చేలా వుంటుంది. ఈ మా సినిమాలో వున్నా నిజాయితీ ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను. దర్శకుడే ఈ కథ రాశారు. ఇది ఫిమేల్ సెంట్రిక్ సినిమా కాదు. అలాగే బాధ పడే సినిమా కూడా కాదు. ధైర్యం ఇచ్చే సినిమా. అక్టోబర్ 6న మీ ముందుకు వస్తోంది. నవీన్ తో పాటు అందరికీ థాంక్స్. నన్ను గుర్తుపెట్టుకొని ఇంత ప్రేమ ఇస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు.

దర్శకుడు శ్రీకాంత్ నాగోతి మాట్లాడుతూ.. నవీన్ చంద్ర గారితో మళ్ళీ కలసి సినిమా చేయాలనుకున్నపుడు ఈ కథని అనుకున్నాం. స్వాతి గారు ఈ సినిమాలోకి వచ్చిన తర్వాత మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా టీం వర్క్. నటీనటులు, టెక్నికల్ టీం గొప్పగా సహకరించారు. మేము ఎంత ప్యాషనేట్ గా తీశామో.. ప్రేక్షకులకు కూడా అంతే చక్కగా రీచ్ అవుతుందనే నమ్మకం వుంది. అక్టోబర్ 6న సినిమాని ప్రేపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది’’

యశ్వంత్ మాట్లాడుతూ.. నవీన్ చంద్ర మేము కలసి చేసిన మా మొదటి చిత్రం భానుమతి & రామకృష్ణ’కి ప్రేక్షకులు, విమర్శకులు గొప్పగా ఆదరించారు. మరో సినిమా చేసే స్ఫూర్తిని ఇచ్చారు. అదే ‘మంత్ ఆఫ్ మధు’. ఒక రియలిస్ట్ క్ సినిమా చేయాలని ఈ సినిమాని మొదలుపెట్టాం. బెస్ట్ యాక్టర్స్, టెక్నికల్ టీం వుంది. నవీన్, స్వాతి గారితో పాటు అందరూ మంచి ప్రతిభగల నటులు వున్నారు. ప్రేక్షకులకు సహజసిద్దమైన అనుభూతిని ఇవ్వడానికి సింక్ సౌండ్ లో షూట్ చేశాం. తొంబై శాతం షూటింగ్ వైజాగ్ లో చేశాం. అన్నీ రియల్ లోకేషన్స్ లో చేశాం. ప్రేక్షకులకు తప్పకుండా ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం వుంది’’ అన్నారు

ఈ చిత్రంలో శ్రేయ నవేలి, హర్ష చెముడు, మంజుల ఘట్టమనేని కీలక పాత్రలు పోషించారు.

అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రానికి రాజీవ్ ధరావత్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. దర్శకుడు రవికాంత్ పేరేపు ఈ చిత్రానికి ఎడిటర్ కావడం సర్ ప్రైజ్.

నటీనటులు: నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి, శ్రేయ నవేలి, హర్ష చెముడు, మంజుల ఘట్టమనేని, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, రాజా చెంబోలు, రాజా రవీంద్ర, రుద్ర రాఘవ్, రుచితా సాదినేని, మౌర్య సిద్దవరం, కంచెరపాలెం కిషోర్ తదితరులు.

సాంకేతిక విభాగం:
రచన & దర్శకత్వం: శ్రీకాంత్ నాగోతి
నిర్మాత: యశ్వంత్ ములుకుట్ల
బ్యానర్లు: కృషివ్ ప్రొడక్షన్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్
సహ నిర్మాత: సుమంత్ దామ
డీవోపీ: రాజీవ్ ధరావత్
సంగీతం: అచ్చు రాజమణి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రఘువర్మ పేరూరి
ఎడిటర్: రవికాంత్ పెరేపు
ఆర్ట్: చంద్రమౌళి ఈతలపాక