Anaganaga : సుమంత్, కాజల్‌ చౌదరి ‘అనగనగా’ హార్ట్ వార్మింగ్ టీజర్ రిలీజ్

సుమంత్‌ లీడ్ రోల్ లో సన్నీ సంజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అనగనగా’. కాజల్‌ చౌదరి కథానాయిక. రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ తెలుగు సంవత్సరాది కానుకగా ప్రేక్షకులను అలరించనుంది.

తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ ని విడుదల చేశారు. సుమంత్‌ ఇందులో చిన్నారులకు ఏ విధంగా పాఠాలు బోధిస్తే అర్థమవుతుందో చెప్పే ఉపాధ్యాయుడిగా కనిపించారు. ‘నోటితో విసిరి.. చేతులతో ఏరుకునేది ఏంటి’ అంటూ సుమంత్‌ సంధించిన పొడుపు కథ ఆసక్తికరంగా ఉంది.

సుమంత్‌ తన క్లాస్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. కాజల్ చౌదరి, అవసరాల శ్రీనివాస్ ప్రజెన్స్ కూడా ఆసక్తికరంగా వుంది. డైరెక్టర్ సన్నీ సంజయ్ అందరికీ కనెక్ట్ అయ్యే కథని హార్ట్ టచ్చింగ్ గా ప్రజెంట్ చేశారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది.

మ్యూజిక్, కెమరావర్క్ కథలోని ఎమోషన్ ని మరింతగా ఎలివేట్ చేశాయి. థాట్ ప్రొవొకింగ్ అండ్ హార్ట్ వార్మింగ్ గా ప్రజెంట్ చేసిన టీజర్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది.

ఈ చిత్రం తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఉగాది సందర్భంగా స్ట్రీమింగ్‌ కానుంది.

నటీనటులు: సుమంత్, కాజల్ చౌదరి, మాస్టర్ విహార్ష్, అవసరాల శ్రీనివాస్, అను హసన్, రాకేష్ రాచకొండ, B.V.S రవి, కౌముది నేమాని

టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం- సన్నీ సంజయ్
నిర్మాతలు: రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి
కో డైరెక్టర్ – గురు కిరణ్
సహ రచయిత – దీప్తి
సినిమాటోగ్రాఫర్ – పవన్ పప్పుల
సంగీతం – చందు రవి
కాస్ట్యూమ్ డిజైనర్ – ప్రియాంక వీరబోయిన
ప్రొడక్షన్ డిజైనర్- ఎల్లోల్ డిజైన్ స్టూడియో అరవింద్ మ్యూల్ & చంద్రిక గొర్రెపాటి
సౌండ్ డిజైనర్ – అశ్విన్ ఆర్
గ్రాఫిక్ డిజైనర్ – రామ్ చరణ్
ఎడిటర్ – వెంకటేష్ చుండూరు
పీఆర్వో: వంశీ శేఖర్

Boomerang Telugu Movie Official Teaser || Anu Emmanuel || Shiva Kandukuri || Vennela Kishore || TR