Gatha Vaibhavam: ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ ‘గత వైభవం’ జనవరి 1న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్

Gatha Vaibhavam: గ్రాండ్ ఫాంటసీ విజువల్ వండర్ ‘గత వైభవం’ గత నెలలో కర్ణాటక వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఎస్ఎస్ దుష్యంత్, ఆషిక రంగనాథ్ నటించిన ఈ చిత్రానికి సునీ దర్శకత్వం వహించడమే కాకుండా, దీపక్ తిమ్మప్పతో కలిసి ఈ ప్రాజెక్ట్‌కు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. సర్వేగర సిల్వర్ స్క్రీన్స్‌తో కలిసి సునీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు గ్రాండ్‌గా తెలుగులో విడుదల కావడానికి సిద్ధమవుతోంది.

కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నేతృత్వంలోని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని జనవరి 1న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది. ఇది న్యూ ఇయర్ కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. ఈ అనౌన్స్మెంట్ ని ఒక అద్భుతమైన పోస్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో చూపించిననట్లుగా కథ నాలుగు విభిన్న కాలాలలో సాగుతుంది.

కన్నడ వెర్షన్‌కు అద్భుతమైన స్పందన లభించడంతో, తెలుగు ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగాయి. పండుగ లాంటి నూతన సంవత్సర విడుదల ఈ చిత్రంపై ఉన్న ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది.

ఈ చిత్రంలో శివకుమార్, ఉల్లాస్ హైదర్, రఘు మైసూర్ అందించిన ప్రొడక్షన్ డిజైన్‌తో పాటు, భారీ నిర్మాణ విలువలు ఉన్నాయి. విలియం జె. డేవిడ్ సినిమాటోగ్రఫీని అందించగా, జుడా శాండీ అందించిన సంగీతం కథలోని భావోద్వేగ, పౌరాణిక అంశాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లింది.

విజువల్ వండర్ గత వైభవం’లో అత్యాధునిక విఎఫ్ఎక్స్, సౌండ్ తో పాటు సాగే గొప్ప కథనం అలరించనున్నాయి. ప్రేమ, పురాణం, పునర్జన్మ , చారిత్రక నాటకం కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులని మెస్మరైజ్ చేయడానికి సిద్ధంగా ఉంది.

Public Reaction On Pawan Kalyan Strong Warning To Ys Jagan || Ap Public Talk || Chandrababu || TR