Mension House Mallesh: హీరో అడివి శేష్ లాంచ్ చేసిన శ్రీనాథ్ మాగంటి ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ ఫస్ట్ సింగిల్

శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలలో బాల సతీష్ దర్శకత్వం లో కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్న సినిమా ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. ఇప్పటికే విడుదలలై ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా హీరో అడివి ఈ సినిమా ఫస్ట్ సింగిల్ బంగారి బంగారి సాంగ్ ని లాంచ్ చేశారు.

మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి ఈ పాటని లవ్లీ మెలోడీగా కంపోజ్ చేశారు. హరిణి ఇవటూరి సోల్ ఫుల్ వోకల్స్ ప్లజెంట్ గా వుంది. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అద్భుతంగా వున్నాయి. ఈ సాంగ్ లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ చాలా బ్యూటీఫుల్ గా వుంది.

ఈ చిత్రానికి ప్రముఖ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నారు. అమ్మముత్తు డీవోపీ కాగా, గ్యారీ BH ఎడిటర్ బాధ్యతలు నిర్వహించారు.

త్వరలోనే ఈ మూవీ థియేటర్స్ లోకి రానుంది.

తారాగణం: శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల, రాజేష్, మురళీధర్ గౌడ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, సాయి ప్రసన్న, పద్మ నిమ్మనగోటి, హరి రెబెల్

రచన & దర్శకత్వం: బాల సతీష్
నిర్మాత: రాజేష్
బ్యానర్: కనకమేడల ప్రొడక్షన్స్
సంగీతం : సురేష్ బొబ్బిలి
డీవోపీ: అమ్మముత్తు
ఎడిటర్: గ్యారీ BH
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, పూర్ణాచారి, అనిరుద్ శాండిల్య మారంరాజు, తరుణ్ సైదులు
పబ్లిసిటీ డిజైన్: ది బ్రాండ్ వాండ్
పీఆర్వో: వంశీ – శేఖర్

పవన్ కళ్యాణ్ జంధ్యం సీక్రెట్ | Secrets Behind Pawan kalyan Jandhyam Maha Kumbh Mela | Telugu Rajyam