డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో శ్రీదేవి శోభన్ బాబు

మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా శ్రీదేవి శోభన్ బాబు. తమిళ్ లో 96, తెలుగులో జాను చిత్రాల్లో చిన్నప్పటి జాను పాత్ర పోషించిన గౌరి కిషన్ హీరోయిన్ గా నటించింది. రోహిణి, నాగబాబు కీలక పాత్రల్లో నటించారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కూతురు సుశ్మిత నిర్మించారు. రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రొమాంటిక్ ఎంటర్టైనర్ అనే టాక్ తెచ్చుకున్న శ్రీదేవి శోభన్ బాబు సినిమా ఈ నెల 30 నుంచి ఓటిటిలో స్ట్రీమ్ కాబోతోంది. ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది.

ఓటిటిలో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ చిత్రం మరింత బాగా ఆకట్టుకుంటుంది. ఇలాంటి సినిమాలకు థియేటర్స్ లో కంటే ఓటిటి లోనే మంచి స్పందన ఉంటుందని ఇప్పటికే విడుదలైన చాలా సినిమాలు నిరూపించాయి. ఆ కోవలోనే ఈ శ్రీదేవి శోభన్ బాబు కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 30నుంచి ప్రేక్షకులను మరోసారి అలరించబోతున్నారు.