శ్రీనివాస్ బెల్లంకొండ, #BSS10 కీలక షెడ్యూల్‌లు పూర్తి- జనవరి 3న టైటిల్

ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీనివాస్ బెల్లంకొండ, ట్యాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర, ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #BSS10 కోసం కలిసి పని చేస్తున్నారు. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈహై బడ్జెట్ చిత్రం, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్, రిచ్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ని విడుదల చేశారు.

మేకర్స్ ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఇచ్చారు. #BSS10 టైటిల్, ఫస్ట్ లుక్ జనవరి 3వ తేదీన శ్రీనివాస్ బెల్లంకొండ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు.

బెల్లంకొండను పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయడానికి సాగర్ కె చంద్ర పవర్ ఫుల్ స్క్రిప్ట్ రాసుకున్నారు. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు

సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, ముఖేష్ జ్ఞానేష్ డీవోపీగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా, కిరణ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌లుగా వ్యవహరిస్తున్నారు. విజయ్, వెంకట్ , రియల్ సతీష్ సినిమా యాక్షన్ పార్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు.

తారాగణం: శ్రీనివాస్ బెల్లంకొండ

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం : సాగర్ కె చంద్ర
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: ముఖేష్ జ్ఞానేష్
ఆర్ట్: అవినాష్ కొల్లా, కిరణ్ కుమార్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఫైట్స్: విజయ్, వెంకట్, రియల్ సతీష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో