బాలకృష్ణ #NBK108 షూటింగ్లో జాయిన్ అయిన శ్రీలీల

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ #NBK108. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

వరుస హిట్లతో దూసుకుపోతున్న నటి శ్రీలీల ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయింది. ఈ సందర్భంగా శ్రీలీల, బాలకృష్ణ చేయి పట్టుకున్నట్లుగా వున్న బ్యూటీఫుల్ స్టిల్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

బాలకృష్ణ మునుపెన్నడూ చూడని పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. #NBK108లో బాలకృష్ణ మార్క్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి

#NBK 108లో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. బాలకృష్ణ గత రెండు సినిమాలకు సంగీతం అందించిన ఎస్ థమన్ #NBK108కి సంగీతం సమకూరుస్తున్నారు. బాలకృష్ణ, అనిల్ రావిపూడి, ఎస్ థమన్ ల పవర్ ఫుల్ కాంబినేషన్ లో సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ షైన్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ చిత్రం చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా వుంది.

సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. తమ్మిరాజు ఎడిటర్ గా, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. వి వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

తారాగణం: నందమూరి బాలకృష్ణ, శ్రీలీల

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: సి రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మి రాజు
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఫైట్స్: వి వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్