Telusu Kada U/A Certificate: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ కు యూఏ సర్టిఫికేట్- అక్టోబర్ 17న గ్రాండ్ గా రిలీజ్

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ యూనిక్ లవ్ స్టొరీ “తెలుసు కదా” ఈ దీపావళికి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 17న విడుదల కాబోతున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని ‘U/A’ సర్టిఫికేట్ పొందింది.

ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.

సెన్సార్ టాక్ ప్రకారం, చిత్రానికి ఫుల్ పాజిటివ్ రిపోర్స్ట్ రావండతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. సినిమా రన్‌టైమ్ 2 గంటల 16 నిమిషాలు, ఎలాంటి లాగింగ్ లేకుండా రేసీగా, ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది,

సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా పాత్రలు యువతరానికి కనెక్ట్ అయ్యేలా ఈ ప్రేమకథ సాగనుంది. కథలో ఊహించని మలుపులు, భావోద్వేగాలు ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పంచనున్నాయి.

సిద్ధు తన స్వాగ్ చార్మ్ ఎనర్జీతో ఆకట్టుకోనున్నాడు. శ్రీనిధి, రాశీ గ్లామర్‌తో అలరించబోతున్నారు. వైవా హర్ష తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించనున్నారు.

ఇప్పటికే ఎస్ థమన్ కంపోజ్ చేసిన రెండు పాటలు వైరల్ అవడంతో మ్యూజిక్ సినిమా మీద మరింత బజ్ క్రియేట్ చేసింది.

“తెలుసు కదా” ఈ దీపావళికి రొమాన్స్, ఫన్, ఫీల్, సోషల్ మెసేజ్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్‌గా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధంగా ఉంది.

KS Prasad Analysis: Janasena Vinutha Driver Viral Video | Telugu Rajyam