సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ రెండో పాట ‘రాధిక’ ఆకట్టుకుంటోంది

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’తో మంచి గుర్తింపు తెచ్చుకొని సక్సెస్ ఫుల్ స్టార్‌గా మారారు. ఈ చిత్రం ఆయనకు, ఆయన పోషించిన పాత్రకు ఎందరో అభిమానులను సంపాదించి పెట్టింది.

ఇప్పుడు ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌ గా రూపొందుతోన్న ‘టిల్లు స్క్వేర్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు సిద్ధు. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన మొదటి గీతం ‘టికెట్టే కొనకుండా’లో అనుపమ గ్లామరస్ అవతార్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పుడు రెండవ గీతంలో కూడా ఆమె ఆకట్టుకుంటోంది. ఇక సిద్ధు జొన్నలగడ్డ పాటకి మరింత ఉత్సాహం తీసుకొచ్చారు.

‘రాధిక’ పాట ఆకర్షణీయమైన బీట్‌ను కలిగి ఉంది. రామ్ మిరియాల తన విలక్షణ శైలిలో పాటను స్వరపరచడమే కాకుండా తానే స్వయంగా ఆలపించారు. ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. రామ్ మిరియాల సంగీతం, గాత్రం, కాసర్ల శ్యామ్ సాహిత్యం కలిసి ఈ పాట అద్భుతంగా ఉంది.

‘డీజే టిల్లు’తో రాధిక పేరు ఒక బ్రాండ్ లా మారిపోయింది. అంతగా జనాదరణ పొందిన ‘రాధిక’ పేరుతో వచ్చిన ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒకసారి వినగానే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే అంతగా ఈ పాట బాగుంది. ఈ పాట ఖచ్చితంగా ఈ సంవత్సరంలోని టాప్ 10 చార్ట్‌బస్టర్‌లలో ఒకటిగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది.

సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

టిల్లు స్క్వేర్ సినిమా 2024, ఫిబ్రవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Radhika Lyric Video | Tillu Square | Siddu Jonnalagadda , Anupama | Mallik Ram | Ram Miriyala