‘సిద్ధార్థ్ రాయ్’ని అద్భుతంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు: సక్సెస్ మీట్ లో ‘సిద్ధార్థ్ రాయ్’ టీం

పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల వద్ద పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తన్వి నేగి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అందరినీ అలరించి యూత్ ఫుల్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ గా అలరిస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.

యూత్ ఫుల్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో దర్శకుడు వి యశస్వీ మాట్లాడుతూ.. ‘సిద్ధార్థ్ రాయ్’ సినిమా థియేటర్స్ లో ఆదరిస్తున్న ప్రేక్షకులకు, ముఖ్యంగా యూత్ కి మా యూనిట్ తరపున ధన్యవాదాలు. థియేటర్స్ లో మంచి ఫుట్ పాల్ వుంది. అన్ని ఏరియాల నుంచి డిస్ట్రిబ్యుటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఫోన్స్ చేసి ఈ వారం వచ్చిన సినిమాల్లో ‘సిద్ధార్థ్ రాయ్’ మంచి సినిమాగా రన్ అవుతుందని చెప్పడం అనందంగా వుంది. ఈ రోజు ఇంకాస్త మెరుగ్గా ఫుట్ ఫాల్ వుంది. ఈ వీకెండ్ మా సినిమా మరింత ప్రేక్షకుల ఆదరణ అందుకొని ముందుకు వెళ్తుందని భావిస్తున్నాం. సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వుంది. యువ ప్రేక్షకులు ఫస్ట్ హాఫ్ కి చాలా కనెక్ట్ అయ్యారు. సెకండ్ హాఫ్ కి పెద్దలు, ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యారు. ఒక యునిక్ బ్లెండ్ తో వుంది సినిమా. మేము అనుకున్నట్లే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వుంది. దీపక్, తన్వి పెర్ఫార్మెన్స్ కి మెస్మరైజ్ అవుతున్నారు. పాటలని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మా సినిమా థియేటర్స్ లో ఇంకా బాగా ఆడి మేము అనుకున్నట్లుగా కమర్షియల్ పే అఫ్ ఇస్తుందని నమ్ముతున్నాం. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు” తెలిపారు.

హీరో దీపక్ సరోజ్ మాట్లాడుతూ.. ‘సిద్ధార్థ్ రాయ్’ అన్ని చోట్ల ప్రేక్షకులని అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మా హోం టౌన్ వైజాగ్ లో థియేటర్స్ యూఫోరియా చాలా బావుంది. క్యారెక్టరైజేషన్ కి చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. దర్శకులు యశస్వీ గారి విజన్ ప్రేక్షకులు చాలా ఇష్టపడ్డారు. ఇది రెగ్యులర్ సినిమా కాదు. ఓ కొత్త కథని చూడాలనుకునే ప్రేక్షకులని అద్భుతంగా అలరిస్తుంది. అందరూ వెళ్లి సినిమా చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా ఓపెనింగ్, క్లైమాక్స్ కి రివిల్ చేయకూడదని కోరుతున్నాను. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’ తెలిపారు.

హీరోయిన్ తన్వి నేగి మాట్లాడుతూ.. సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చాలా ఆనందాన్ని ఇస్తోంది. ప్రేక్షకులు నా పాత్రని చాలా ఇష్టపడుతున్నారు. ఫుల్ క్రౌడ్ వున్న థియేటర్స్ లో సినిమా చూడటం చాలా థ్రిల్ ఇచ్చింది. చాలా కొత్త అనుభూతిని ఇచ్చే సినిమా ఇది. తప్పకుండా అందరూ వెళ్లి సినిమా చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అన్నారు.

సహా నిర్మాత ప్రదీప్ పూడి మాట్లాడుతూ.. నిన్నటి కంటే ఈ రోజు బెటర్ ఫుట్ పాల్ వుంది. వైజాగ్, రాజమండ్రిలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా చోట్ల హౌస్ ఫుల్స్ అయ్యాయి. సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంకా చూడని ప్రేక్షకులు తప్పకుండా వెళ్లి సినిమా చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మంచి సినిమా చేశారనే ప్రసంశలు వచ్చాయి. మంచి సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది” అన్నారు.